ఆంధ్రప్రదేశ్‌

పంపులకు మాత్రమే స్విచ్ ఆన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 15: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పంపులను నిర్దేశిత గడువు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం స్విచ్ ఆన్‌చేసి ప్రారంభించారు. ఈనెల 15వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ పథకాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో బిహెచ్‌ఇఎల్ నుంచి రావాల్సిన పంపులు ఇంకా పురుషోత్తపట్నానికి చేరకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా హంద్రీ నీవా పథకం నుంచి తెచ్చిన రెండు పంపులను ఆదరబాదరా ఇక్కడకు తెచ్చి బిగించారు. ఈ పంపులను స్విచ్ ఆన్‌చేసి ముఖ్యమంత్రి అనుకున్నట్టుగా ఆరంభించారు. పంపుహౌస్‌ను తాకుతున్న గోదావరి జలాలకు నది ఒడ్డున నీరాజనం పలికి పూజ నిర్వహించారు. వాస్తవానికి ఈ పూజ డిశ్చార్జి పాయింట్ వద్ద చేసేందుకు ఏర్పాట్లుచేశారు. పైపులైను వెల్డింగ్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో నేలకోట గ్రామం వద్ద పురుషోత్తపట్నం డిశ్చార్జి పాయింట్ వరకు నీళ్లు చేరేందుకు మరో రెండు, మూడు రోజుల సమయంపట్టేలా ఉంది.

చిత్రం.. డిశ్చార్జి పాయింటుకు నీరు వచ్చే అవకాశం లేకపోవడంతో పంపుహౌస్‌ను
తాకుతున్న గోదావరి నదికి జలపూజ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు