ఆంధ్రప్రదేశ్‌

మిన్నంటిన పంద్రాగస్టు సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఆగస్టు 15: రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి ఎస్వీయూలోని తారకరామా స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంద్రాగస్టు వేడుకలలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పంద్రాగస్టు వేడుకలతో నగర జనం పులకించారు. భద్రతా కారణాలు, స్థలాభావం దృష్ట్యా స్టేడియంలోకి జన నియంత్రణ చేసినప్పటికీ నగర ప్రజలు, భక్తులు తిలకించడానికి వీలుగా నగరంలో పలు ప్రధాన కూడళ్లలో ఎల్‌ఇడి స్క్రీన్‌లను ఏర్పాటుచేశారు. నగర ప్రజలు కూడా ఈ వేడుకలను ఆసక్తిగా తిలకించారు. వారం రోజులుగా వరుణుడు అధికారులు చేపడుతున్న పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లకు వరుణుడు తరచూ విఘాతం కల్పించి పరీక్షలు పెట్టారు. మంగళవారం మాత్రం వర్షం రాకపోవడంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆద్యంతం కన్నుల పండువగా సాగాయి. అధికారులు హమ్మయ్యా.. అనుకున్నారు. అంతేకాదు అవాంతరాలను అధిగమించడంలో తాము సిద్ధహస్తులమని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, సబ్ కలెక్టర్ నిషాంత్‌కుమార్, జెసి గిరీషా, నగర పాలక సంస్థ కమిషనర్ హరికిరణ్, అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, డిఐజి ప్రభాకర్‌రావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చాటిచెప్పారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా పోలీస్ దళాలు నిర్వహించిన బైక్ సాహస విన్యాసాలు నిజంగానే అత్యంత సాహసంగానే జరిగాయని చెప్పాలి. ఈ విన్యాసాలు చేసిన బృందాన్ని సిఎం చంద్రబాబునాయుడు ప్రశంసించడంతో పాటు వారికి ట్రోఫీని, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా తిరుపతి శ్రీ పద్మావతి సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు, ఇతర కళాకారులు చేసిన ప్రతి ప్రదర్శన ఆహూతుల ప్రశంసలు అందుకుంది. రాష్ట్ర ప్రగతిని చాటుతూ వివిధ శాఖలకు సంబంధించిన 12 శకటాలు మైదానంలో ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో టిటిడి ఏర్పాటుచేసిన వాహనం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అటవీశాఖ ఏర్పాటుచేసిన శకటానికి ప్రథమస్థానం లభించింది. అటుతరువాత జలసిరి, విద్యాశాఖలకు సంబంధించిన శకటాలు వరుస స్థానాల్లో నిలిచాయి. కవాతులో పాల్గొన్న మాజీ సైనికులకు కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మెమెంటో అందజేసి అభినందించారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు పోలీసు బృందాలు మైదానంలోకి ప్రవేశించాయి. 9.10 నుంచి 9.31 గంటల వరకు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ముఖ్య కార్యదర్శి దినేష్‌కుమార్, డిజిపి నండూరి సాంబశివరావు, సాధారణ పరిపాలన పొలిటికల్ కార్యదర్శి శ్రీకాంత్, ఎపి ఎస్ పి బెటాలియన్ ఐజి రాజీవ్‌కుమార్ మీనన్, కలెక్టర్ ప్రద్యుమ్న, రాష్ట్ర ప్రొటోకాల్ అడిషనల్ సెక్రటరీ లెప్టనంట్ కల్నల్ ఎం. అశోక్‌బాబు, రాయలసీమ డిఐజి ప్రభాకర్‌రావు, అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతితో పాల్గొన్నారు.

చిత్రాలు.. తిరుపతి ఎస్వీయూలోని తారకరామా స్టేడియంలో మంగళవారం నాడు స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో పోలీసుల కవాతును తిలకిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పక్కన డిజిపి సాంబశివరావు