ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచే జగన్ జలదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 15: కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం నుంచి మూడు రోజుల పాటు జలదీక్ష చేపట్టనున్నారు. అందుకోసం కర్నూలు నగర శివారులోని నంద్యాల రహదారిలో వేదిక, తదితర ఏర్పాట్లు సిద్ధం చేశారు. కృష్ణా నదిపై పాలమూరు, దిండి ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే దిగువన ఉన్న రాయలసీమ, కృష్ణా డెల్టా ప్రాంత రైతులకు సాగునీరు అందదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దిగువ ప్రాం త రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని వైకాపా డిమాండ్ చేస్తోంది. అలాగే ఎగువన తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా కృష్ణా నదిపై ప్రాజెక్టులను నిర్మించడానికి సమాయత్తమవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైకాపా ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలిపై నోరు మెదపకుండా వౌనం వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. కాగా జగన్ దీక్షా శిబిరంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు పెద్దఎత్తున కర్నూ లు నగరానికి వచ్చారు. దీక్షా స్థలికి వచ్చేవారికి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు చల్లని మంచినీరు, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
chitram...
కర్నూలు నగర శివారులోని నంద్యాల రహదారిలో జగన్ జలదీక్ష కోసం ఏర్పాటు చేసిన శిబిరం