ఆంధ్రప్రదేశ్‌

టెండర్ల దశ దాటని పవర్ ప్లాంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 17: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన పవర్‌హౌస్ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గత మూడు నెలలుగా పనుల్లో పురోగతి కనిపించడంలేదు. అఖండ గోదావరి నది ఎడమ గట్టు వైపు పోలవరం పవర్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. పవర్ హౌస్ నిర్మాణానికి సంబంధించి దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామాన్ని రెండేళ్ల క్రితం ఖాళీ చేయించారు. ఇప్పటికీ అక్కడ మట్టి పనులు కూడా పూర్తికాలేదు. ప్రధానంగా ఒక కొండ ప్రాంతాన్ని తొలగించాల్సివుంది. ఈ పనుల్లో అసలు పురోగతి కన్పించడంలేదు. మట్టి పనులు కూడా పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్సులో భాగంగా జరుగుతున్నాయి. పవర్ హౌస్‌ను 960 మెగావాట్ల సామర్ధ్యంతో 12 యూనిట్లుగా నిర్మిస్తున్నారు. ఈ పవర్ అందుబాటులోకి వస్తే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు పుష్కలంగా విద్యుత్‌ను అందించే అవకాశం రాష్ట్రానికి చేకూరనుంది. పవర్ హౌస్‌కు పెట్టిన పెట్టుబడి ఏడాదిలోనే తిరిగివచ్చే అవకాశం వుంది. బ్లాండ్ల ద్వారా ఈ నిధులను సమీకరించుకునే అవకాశం కన్పిస్తోంది. అయితే పోలవరం పవర్ హౌస్ నిర్మాణ పనులు టెండర్ల దశ నుంచి బయట పడలేదు. మట్టిపని వాస్తవానికి జూన్ నాటికే పూర్తికావాల్సి ఉన్నప్పటికీ, ఇంకా కాలేదు. మరో వైపు టెండర్ల అంచనాలు అంతకంతకూ పెంచారని, అనుకూలమైన వారికే దక్కే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. రూ. 1000 కోట్ల అంచనాతో మొదలు పెట్టిన ఈ పనులు ప్రస్తుతం సుమారు రూ.5000 కోట్లకు చేరుకుందంటున్నారు. టెండరు నిబంధనలు అంతర్జాతీయ స్థాయిలో వుండే అతి పెద్ద సంస్థకు అనుకూలంగా రూపొందించారని ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ మేరకు ప్లాంటు నిర్మించే సంస్థ టర్బైన్లు కూడా తయారుచేసే సామర్ధ్యం వుండాలని టెండరు నిబంధనలు రూపొందించడం వల్లే ఆలస్యమవుతోందని తెలిసింది. ఇటు టర్బైన్లు, అటు ప్లాంటు నిర్మించే అర్హత ఒకే ఒక సంస్థకు వుందని తెలుస్తోంది. అర్హతలు కలిగిన ఈ సంస్థ కోసమే టెండరు నిబంధనలు రూపొందించారని తెలిసింది. ఏదేమైనప్పటికీ పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

చిత్రం..అంగుళూరు వద్ద నత్తనడకన సాగుతున్న పోలవరం పవర్ హౌస్ నిర్మాణ పనులు