ఆంధ్రప్రదేశ్‌

‘స్టేట్ ఫుడ్ కమిషన్’కు జవసత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 18: రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ‘స్టేట్ ఫుడ్ కమిషన్’కు పూర్తి జవసత్వాలు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఆహార భద్రతతో పాటు ధరల నియంత్రణ, నాణ్యత గల పౌష్టికాహారాన్ని అందించడం వంటి బాధ్యతలతో ఈ కమిషన్ స్వతంత్య్రంగా వ్యవహరిస్తుందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో పౌర సరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఫుడ్ కమిషన్, రైతుబజార్లు, విలేజ్ మాల్స్ వంటి అంశాలపై సమీక్షించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013లోని సెక్షన్ 40ను అనుసరించి రాష్ట్ర ఆహార భద్రత నిబంధనలు, 2017ను రూపొందించారు. జిల్లాల జాయింట్ కలెక్టర్-2 ఇక నుంచి డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ రిడ్రస్సల్ అధికారిగా వ్యవహరిస్తారు. రాష్టస్థ్రాయిలో దీనిపై త్వరలో ఒక వర్క్‌షాపును నిర్వహించనున్నారు. ఇందులో ఫుడ్ కమిషన్ భాగస్వామ్యులు, డిజిఆర్‌వోలు, స్ర్తి శిశు సంక్షేమశాఖ అధికారులు, పాఠశాల విద్యాశాఖ అధికారులు పాల్గొంటారు. కమిషన్‌కు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు జరుపుతామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని రైతుబజార్లను పౌర సరఫరాల శాఖకు అనుసంధానం చేయాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. 10వేల జనాభాకు ఒకటి చొప్పున మొత్తం 500 రైతుబజార్లను ఏర్పాటు చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్ వివరించారు. నాలుగైదు మాసాల వ్యవధిలో 300 రైతుబజార్లను ప్రారంభిస్తామని తెలిపారు. వీటిని క్రమంగా ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లుగా మారుస్తామని చెప్పారు. 18 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసరిగా రైతుబజార్ వ్యవస్థను ప్రవేశపెడితే ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు వీటి అసలు లక్ష్యాలను దెబ్బతీశాయని ముఖ్యమంత్రి ఆవేదన చెందారు. రైతులు పండించిన ఉత్పత్తులకు రైతుబజార్లలో గిట్టుబాటు ధర దక్కేలా చేయడమే గాక, వినియోగదారుడికి ప్రయోజనం కలిగేలా ధరల నియంత్రణ జరిగేదని గుర్తుచేశారు. ఎరువులు, విత్తనాల దగ్గర్నుంచి సమస్తం రైతు బజార్లలో లభ్యమయ్యేలా మళ్లీ వాటికి పునర్వైభవాన్ని తీసుకురావాలని చెప్పారు. దీనిపై వారం రోజుల్లో స్పష్టమైన కార్య ప్రణాళికతో రావాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో విలేజ్ మాల్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. చిత్తూరు జిల్లాలో అన్ని రకాల ఉత్పత్తులను వినియోగదారుడికి అందించేలా ‘స్టోర్ బాక్స్’ పేరుతో చేసిన ప్రయోగం అనూహ్య ఫలితాలను సాధించిందని, ఈ తరహాలో విలేజ్ మాల్స్‌ను ఏర్పాటుచేసే అంశంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మహిలలకు పౌష్టికాహారాన్ని అందించే ‘అన్న అమృతహస్తం’, ఏడు మాసాల నుంచి మూడేళ్ల వయసు వరకు గల చిన్నారులకు ఉద్దేశించిన ‘బాలామృతం’ పథకాలపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. వీటిని మరింత సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.