ఆంధ్రప్రదేశ్‌

ప్రశాంతంగా ఐసెట్-2016

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 16: ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎపిఐసెట్-2016 రాష్ట్రంలో సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు 89.48 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం ఆరు గంటలకు ఈ పరీక్షకు సంబంధించిన సెట్ కోడ్‌ను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. 17 ప్రాంతీయ కేంద్రాల్లో 138 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 72066 మంది దరఖాస్తు చేయగా, 64485 మంది హాజరయ్యారు. ప్రాంతాల వారీగా హాజరు శాతాన్ని పరిశీలిస్తే, అనంతపురంలో 91.23 శాతం, భీమవరంలో 87.66, గుంటూరులో 90.68, కడ పలో 91.63, కాకినాడ 86.23, కుప్పంలో 93.25, కర్నూలులో 87.48 శాతం, నెల్లూరులో 91.23, ఒంగోలులో 90.05, రాజమండ్రిలో 89.69, శ్రీకాకుళంలో 85.2, తిరుపతిలో 91.51, విజయవాడలో 88.74, విశాఖలో 85.67, విజయనగరంలో 88.48, చిత్తూరులో 92.75, అమలాపురంలో 89.52 శాతం మంది హాజరయ్యారని ఎపిఐసెట్ కన్వీనర్ ఆచార్య కె.రామ మోహనరావు తెలిపారు. పరీక్ష నిర్వహణ తీరును ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాలరెడ్డి పరిశీలించారు. సెట్ కోడ్ విడుదల కార్యక్రమంలో ఎయు ఇన్‌చార్జి వీసీ ఆచార్య ఇ.ఎ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య ఉమ మహేశ్వరరావు, ఎయు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.