ఆంధ్రప్రదేశ్‌

రూ.50 కోట్లతో శ్రీశైలం సమగ్రాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 18: పర్యాటకశాఖ గత కొద్దికాలంగా చేస్తున్న కృషి ఫలితాలను ఇచ్చింది. ప్రసాద్ పథకం కింద శ్రీశైలం సమగ్రాభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. శుక్రవారం ఢిల్లీ వేదికగా కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, ఎపిటిడిసి ఎండి హిమాన్షు శుక్లా ఈ సమావేశంలో స్వయంగా పాల్గొన్నారు. దేవాలయ పర్యాటకం అభివృద్ధిలో భాగంగా పురాతన శ్రీశైలం ఆలయ అభివృద్ధికి నిధులు కావాలంటూ మీనా చేసిన విజ్ఞప్తి పట్ల ఈ సానుకూల నిర్ణయం వెలువడింది. నిజానికి గత కొంతకాలంగా ప్రసాద్ పథకం కింద శ్రీశైల సమీకృత అభివృద్ధికి నిధులు పొందాలని ప్రయత్నిస్తూ వస్తున్నప్పటికీ అది వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శిగా మీనా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా సంబంధిత అధికారులతో నిధుల విషయంపై చర్చించేవారు. ఈ నేపధ్యంలోనే అక్కడి అధికారులకు శుక్రవారం శ్రీశైలం మహా పుణ్యక్షేత్రాన్ని ఏ తీరుగా అభివృద్ధి చేయదలుచుకున్నామన్న విషయాన్ని సచిత్రంగా ప్రదర్శించి, అవసరమైన నిధుల గురించి వివరించటంతో తక్షణమే ఆమోద ముద్ర లభించింది. ఫలితంగా శ్రీశైల పుణ్యక్షేత్రం దేవాలయ పర్యాటకులకు ఒక మైలు రాయి కానుందని మీనా వివరించారు. విభిన్న పనుల కోసం దాదాపు రూ.50 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో ఏ పనులు చేపట్టనున్నామన్న దానిపై కూడా పూర్తిస్థాయి నివేదికను అందించామన్నారు. ప్రధాన దేవాలయం అభివృద్ధికి రూ.16.50 కోట్లు వ్యయం అవుతుందని, శిఖరం అభివృద్ధికి రూ.4.28 కోట్లు వ్యయం చేయవలసి ఉంటుందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే ఉన్న రోప్‌వేను మరింతగా విస్తరించాలని నిర్ణయించామని, అది పాతాళగంగను చేరనుండగా, ఇందుకోసం రూ.1.31 కోట్లు వ్యయ అంచనాలు ఉన్నాయన్నారు. రహదారుల ఆధునీకరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్ల కోసం రూ.13.61 కోట్లతో అంచనాలు సిద్ధం చేశామన్నారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట ఉండటం అనే విశిష్టత మేరకే పర్యాటక శాఖ ఈ దేవాలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. పర్యాటక సౌకర్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని, ఇందుకోసం దాదాపు రూ.2 కోట్లు వ్యయం అవుతుందన్నారు. పార్కింగ్ అవసరాన్ని సైతం పరిగణనలోకి తీసుకున్నామని, బస్టాండ్ సమీపంలో ఒకటి, అవుటర్ రింగ్‌రోడ్డు సమీపంలో మరొకటి ఏర్పాటు చేయనున్నామని ఇందుకోసం రూ.2.72 కోట్లు ఖర్చుచేయవలసి ఉంటుందన్నారు.