ఆంధ్రప్రదేశ్‌

‘ప్రత్యేక సెలవు’గా ఆర్టీసీ సమైక్యాంధ్ర సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 18: 2013లో హోరాహోరీగా సాగిన సమైక్యాంధ్ర ఉద్యమ కాలాన్ని ఆలస్యంగానైనా ఏపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగ, కార్మికులకు ప్రత్యేక సెలవుగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నెం.7771/టిఆర్-2/2015 పేరిట శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. నాడు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్‌టిసి ఉద్యోగ, కార్మికులు దాదాపు 60వేల మంది 60 రోజులపాటు నిరవధిక సమ్మె చేశారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు తక్షణమే ఉద్యోగ వయో పరిమితిని 60 ఏళ్లకు పెంచడంతోపాటు సమ్మెకాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించారు. దీన్ని తమకు కూడా వర్తింప చేయాలంటూ ఆర్‌టిసి కార్మిక సంఘాలు పోరాడుతూ వచ్చాయి. వీరి పోరాటం నేటికి సాకారమైంది. ఈ సందర్భంగా ఎన్‌ఎంయు నేతలు శుక్రవారం ఓ ప్రకటనలో సిఎం చంద్రబాబు, రవాణాశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, సంస్థ ఎండి ఎం.మాలకొండయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు.