ఆంధ్రప్రదేశ్‌

నిర్వాసితుల కదలికలపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం, ఆగస్టు 18: శ్రీకాకుళం జిల్లాలో వంశధార నిర్వాసితుల కదలికలపై పోలీస్ నిఘా పెంచారు. వంశధార నిర్వాసితుల గ్రామాలకు వెళ్లే రహదారుల్లో అడుగడుగునా పోలీస్ బలగాలు తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల పోలీసులు, నిర్వాసితుల మధ్య చోటుచేసుకున్న సంఘటనలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీస్ విభాగానికి చెందిన ఐదుగురు వ్యక్తులు గాయాలకు గురికావడం, నిర్వాసితులు పదేపదే ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో పోలీసుల నిఘాను పెంచారు. ఆయా గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే నిర్వాసితులను తనిఖీ చేసి వివరాలు సేకరిస్తున్నారు. కళాశాలలకు వెళ్లే విద్యార్థుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆయా గ్రామాలకు వెళ్లే వారి వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. ‘వంశధార’ ఉద్యమాల్లో పాల్గొన్న నిర్వాసితులను పోలీసులు చిత్రీకరించిన పుటేజీని పరిశీలించి వాటికి అనుగుణంగా ఆయా వ్యక్తుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. తులగాం, పాడలి, దుగ్గుపురం గ్రామాల రహదారి కూడళ్లలో భారీగా పోలీసులను, వజ్ర వాహనాన్ని అందుబాటులో ఉంచారు.
పోలీస్ బలగాల మధ్య పనులు
పోలీసు బలగాల మధ్య వంశధార రిజర్వాయర్ పరిధిలోకి వచ్చే పంట భూముల గట్లును చదును చేసే పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. పదుల సంఖ్యలో పొక్లయిన్లతో పాటు వందలాది ట్రాక్టర్లతో పనులను జోరుగా చేపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు తయారు చేశారు. తులగాం, పాడలి, దుగ్గుపురం, చిన్న సంకిలి గ్రామాల నిర్వాసితులకు సంబంధించి పంట పొలాలను చదును చేశారు. ఇప్పటివరకు 200 ఎకరాల్లో చదును చేసినట్టు అధికారుల సమాచారం. ఈ పనులను పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్య, తహశీల్దార్ కాళీప్రసాద్, వంశధార ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ జరిపారు.

చిత్రం..వంశధార పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లే రహదారిలో మోహరించిన పోలీస్ బలగాలు