ఆంధ్రప్రదేశ్‌

అర్చకుల వేతనాలు తగ్గించబోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 18: అర్చకుల సంక్షేమానికి తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, ఇందులో ఎటువంటి అపార్థాలు, అపోహలు అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం తనను వెలగపూడి సచివాలయంలో కలిసిన అర్చక ప్రతినిధులతో మాట్లాడుతూ ఎవరి వేతనాలనూ తగ్గించే సమస్యే లేదని, ఇందుకు తాను భరోసా ఇస్తున్నానన్నారు. అర్చకుల్లో, ధార్మిక ఉద్యోగుల్లో ప్రభుత్వం మీద అపోహలు సృష్టించే శక్తులపై అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. రూ.10వేల వేతనం పొందుతున్న ధార్మిక సిబ్బందికి వేతనం తగ్గించే సమస్యే లేదని, అసలు వేతనాలు తగ్గించాలన్న ఆలోచనే తమకు లేదని ముఖ్యమంత్రి వివరించారు. పనిగట్టుకుని ఇటువంటి ప్రచారాలు చేస్తున్న శక్తులను ఓ కంట కనిపెట్టి ఉండాలన్నారు. దైవాలకు నైవేద్యాలు సమర్పిస్తూ, ధూపదీపాలతో ఆరాధిస్తూ జన శ్రేయస్సు కోరే అర్చకులు పేదరికంలో ఉండటం తమను కలచి వేసిందన్నారు. అందుకే తాము చొరవ తీసుకుని రాష్ట్రంలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో అర్చకులకు నెలకు రూ.5వేలకు తగ్గకుండా కనీస వేతనం చెల్లించే విధంగా జీవో తెచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. అర్చక, ఉద్యోగుల జీతం, పారితోషిక నిధికి సంబంధించి మూల నిధిపై వచ్చిన వడ్డీ నుంచి చెల్లించామన్నారు. తిరిగి గత ఏడాది జనవరి నుంచి వేతనాలను రూ.10వేలకు పెంచినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 923 మంది ధార్మిక సిబ్బందికి పారితోషిక నిధి నుంచి నెలకు రూ.10వేల వేతనాన్ని చెల్లిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆదాయ వనరులు ఉన్న దేవాలయాల్లో పనిచేస్తున్న 535 మంది ధార్మిక సిబ్బందికి దేవాలయ నిధుల నుంచి వేతనం చెల్లించాలని ఆదేశించామన్నారు. తమకు ఆరోగ్య కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అర్చక ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరగా వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసిన అర్చక ప్రతినిధులతో అత్తలూరి అక్షయలింగ శర్మ, వైఎస్‌ఆర్‌కె ప్రసాద్, అంగర రాంబాబు ఉన్నారు.