ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో గణనీయంగా తగ్గిన అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 18: రాష్ట్రంలో అవినీతి గణనీయంగా తగ్గిందని, 2017 సంవత్సరానికి సంబంధించి నేషనల్ కౌన్సిల్ అప్లైడ్ ఎకనమిక్స్ రిసెర్చ్ (ఎన్‌సిఐఆర్‌ఎ) సర్వేలో అవినీతిలో దేశంలో ఏపీ 19 స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో, పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి అడ్డుకట్ట వేస్తూ, పారదర్శకతకు, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇదే విషయం ఎన్‌సిఐఆర్‌ఎ సర్వే వెల్లడించిందన్నారు. ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో నిలిచిందన్నారు. వచ్చే ఏడాది ఈ ర్యాంకు మరింత తగ్గి 24వ స్థానానికి ఏపీ వచ్చే అవకాశం ఉందన్నారు. పరిష్కార వేదిక 1100 పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు రాష్ట్రంలో అవినీతికి అడ్డుకట్ట వేసిందన్నారు. అయితే 2016 సంవత్సరానికి ఎన్‌సిఐఆర్‌ఎ సర్వేలో ఏపీకి 3వ ర్యాంకు వచ్చిందన్నారు. 12 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, 4-5 నెలల టిడిపి ప్రభుత్వ పాలన ఆధారంగా ఆ ర్యాంకు వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి కారణంగా 2016లో ఏపీకి 3వ ర్యాంకు వచ్చిందన్నారు. ఈ విషయం పట్టించుకోకుండా కేవలం అవినీతిలో ఏపీకి 3వ ర్యాంకు వచ్చిందంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు, పిఏసి చైర్మన్ బుగ్గన రాజేంద్రప్రసాద్ లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. ప్రజా పరిష్కార వేదిక 1100 ద్వారా వచ్చే ఏడాది రాష్ట్రంలో అవినీతి మరింతగా తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో 1100కు వచ్చే ఫిర్యాదుల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపకుంటే, సిటిజన్ చార్టర్ మాదిరిగా సదరు అధికారికి హెచ్చరికలు జారీ చేస్తామన్నారు. అధికారుల్లో జవాబుదారీతనం పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. 89.4 శాతం మంది మద్యం పాలసీపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. 92 శాతం మంది మద్యం అమ్మకాలను నియంత్రిచాలని అభిప్రాయపడ్డారన్నారు. బెల్ట్ షాపుల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బాగున్నాయని 36 శాతం మంది అభిప్రాయపడ్డారన్నారు.