ఆంధ్రప్రదేశ్‌

మహిళలు స్వశక్తితో ఎదిగితే రిజర్వేషన్ల అవసరం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 19: మహిళలు స్వశక్తితో ఎదిగితే రిజర్వేషన్ల అవసరం ఎంతమాత్రం ఉండదని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి వై సుజనాచౌదరి అభిప్రాయపడ్డారు. గర్ల్స్ ఇన్ టెక్ ఫౌండేషన్, ఎపి ఉన్నత విద్యామండలి, యువజన సర్వీసుల శాఖ సహా పలు సంస్థల ఉమ్మడి ఆధ్వర్యంలో విశాఖలో శనివారం జరిగిన ‘షీ బిల్డ్స్ టెక్ స్మార్ట్‌సిటీ హేక్థాన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని కేంద్రం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు.
మహిళలు ఆ దిశగా ఎదిగితే వారికి రిజర్వేషన్ల అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. ఇప్పటికే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లింగ వివక్ష పెద్ద సవాలుగా నిలించిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువగా ఉందని, వివక్షను అధిగమించాలంటే మహిళలు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకుని స్వశక్తిపై నిలిచేందుకు ప్రయత్నించాలన్నారు. అలాగే మన విద్యా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ కళాశాల్లో ర్యాంకులే పరమావధిగా బట్టీపట్టే విధానాన్ని అమలు చేస్తున్నారని, ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. టెన్త్, ఇంటర్ వరకూ బాలికలు చదువులో టాపర్లుగా నిలుస్తున్నారని, ఆపై ఉన్నత చదువుల్లో బాలికల చేరిక తగ్గుతూ ఆందోళన కల్గిస్తోందన్నారు. గతేడాది ఐఐటిలో 8 శాతం, ఎన్‌ఐటిలో 13 శాతం మాత్రమే బాలికలు చేరారని, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తేనే బాలికలు తాము అనుకున్నది సాధించగలుగుతారన్నారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగితే వారే పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతారన్నారు.
సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకునే విధంగా ఎదగాలన్నారు. తాను కూడా సాహసాలు చేసే పారిశ్రామికవేత్తగా ఎదిగానన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలకు ఎంతో ప్రోత్సాహాన్నందిస్తున్నాయని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలన్నారు. స్టాండప్ ఇండియా పేరిట కేంద్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తోందని, జాతీయ బ్యాంకులు వీరికి రుణాలు ఇచ్చేలా విధివిధానాలు రూపొందించారన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్, గర్ల్స్ టెక్ ఫౌండేషనన్ చైర్ పర్సన్ శ్రీ దివ్య, యుఎస్ కాన్సులేట్ గాబ్రియల్, ధర్మపథ, సిఇఓ రాజశేఖర్ ఇందుకూరి, ఎఐసిటిఇ డైరెక్టర్ మన్‌ప్రీత్‌సింగ్ మన్నా, దక్షిణాసియా యుఎస్ ఎంబసీ మెహనాజ్ అన్నారీ తదిరతులు పాల్గొన్నారు.