ఆంధ్రప్రదేశ్‌

వెంకయ్యస్వామికి వైభవంగా హనుమంత, చంద్రప్రభ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఆగష్టు 19: నెల్లూరు జిల్లాలో ప్రఖ్యాతి చెందిన పుణ్యక్షేత్రం గొలగమూడిలో అవధూత వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రోజుకు రెండు వాహన సేవలు జరుగుతున్నాయి. ఆరాధనోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం హనుమంత వాహన సేవ జరగ్గా రాత్రి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. సర్వాంగ సుందరంగా అలంచకరించి వెంకయ్యస్వామి విగ్రహాన్ని వాహనంపై వేంచేపు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఊరేగింపునకు ముందు కొందరు భక్తులు భజన చేస్తూ ముందుకు సాగగా, మహిళలు కోలాటం చేస్తూ అనుసరించారు. వాహన సేవలకు ముందు సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవానికి ముందు అశ్రమంలో ఉదయం గోపూజ, విష్ణుసహస్రనామం, సుప్రభాత సేవ, అభిషేకం, ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, వాహన సేవ, ఏకంత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి చంద్రప్రభ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలను ఆశ్రమ ఇవో బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు.

చిత్రం..హనుమంత వాహన సేవపై కొలువు తిరి ఉన్న వెంకయ్యస్వామి