ఆంధ్రప్రదేశ్‌

ఓటుతో వైకాపాను ఖతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 19: అవినీతి సొమ్ముతో జనాన్ని కొనుగోలు చేసేందుకు వచ్చిన వైకాపాను ప్రజలు తమ ఓటుతో ఖతం చేయాలని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నంద్యాల శాసన సభా నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన నంద్యాలలో పర్యటించారు. పట్టణ శివారులోని అయ్యలూరు మెట్ట నుంచి రోడ్‌షో నిర్వహిస్తూ పలు కూడలి ప్రదేశాల్లో ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని వేల కోట్లు అక్రమంగా సంపాదించి ఆ కేసుల నుంచి బయటపడేందుకు సీఎం కావాలని తపిస్తున్న వైకాపా అధినేత జగన్ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరంగా కష్టపడుతున్న తనను కాల్చాలని, ఉరి తీయాలని, బట్టలూడదీస్తానని విపరీత పదజాలంతో దూషించడాన్ని ప్రజలు ప్రశ్నించాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీని ప్రజలు అక్కున చేర్చుకుంటే వైకాపా నేతలు పారిపోవడం ఖాయమని అన్నారు. నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం ఎప్పుడో ఖాయమైందన్నారు. అయినా పార్టీ అధినేతగా ప్రజలను ఓటు వేయమని కోరడానికి తాను నంద్యాల వచ్చానని పేర్కొన్నారు.
తాను ముఖ్యమంత్రి అయిన సమయంలో రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉందని, రాజధాని లేకపోవడం, ఆదాయ వనరులు లేకపోవడం వంటి అనేక సమస్యలు ఎదురయ్యాయని అన్నారు. రాష్ట్రంలో తనకు జగన్ ప్రత్యర్థి కానే కాడన్నారు. సమస్యలు, సవాల్లే ప్రత్యర్థులని ఆయన అన్నారు. వాటిని అధిగమించడానికి రోజుకు 18 గంటలు కష్టపడుతున్న విషయం ప్రజలు గమనిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. నంద్యాలలో భూమా నాగిరెడ్డి వైకాపాను వీడి టిడిపిలో చేరడానికి కారణం కేవలం అభివృద్ధేనని తెలిపారు. నంద్యాలను సుందర పట్టణంగా, సమస్యలు లేని ప్రజలను చూడాలని ఆయన తహతహలాడారని పేర్కొన్నారు. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి తూచ తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మంత్రి అఖిలప్రియకి రాజకీయంగా అనుభవం లేకపోయినా తనకు ఇచ్చిన మంత్రిత్వశాఖ ద్వారా రాష్ట్భ్రావృద్ధి, తన తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి నంద్యాల అభివృద్ధికి ఆమె చేస్తున్న కృషి చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతోందన్నారు. బాబాయి, చెల్లెలు తరహాలోనే బ్రహ్మానంద రెడ్డి కూడా విశేష కృషి చేసి నంద్యాల అభివృద్ధికి తోడ్పడుతాడని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి మచ్చలేని టిడిపితో మాత్రమే సాధ్యమన్నారు. అవినీతి ఊబిలో కూరుకుపోయి బయటకురాలేని నాయకులను అందలం ఎక్కిస్తే రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని అన్నారు. ప్రజలు సమయస్ఫూర్తితో ఆలోచించి నంద్యాల నియోజకవర్గంలో బ్రహ్మానందరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

చిత్రం..రోడ్ షోలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు