ఆంధ్రప్రదేశ్‌

కామాంధులకు 22 ఏళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), మే 16: యుక్త వయసులో వున్నా ఆమెకేమీ తెలీదు.. మానసిక దివ్యాంగురాలు.. దీనికితోడు పుట్టు మూగ, చెవుడు. కళ్లు కూడా సరిగా కనపడక పోవడంతో గుంటూరులో వైద్యం చేస్తారని తెలుసుకున్న పేరేచర్ల ప్రాంతానికి చెందిన ఆ యువతి 2014 ఫిబ్రవరి 3న గుంటూరు చేరుకుంది. అమాయకంగా కనిపించిన ఆ యువతిని స్థానిక నల్లచెరువుకు చెందిన దాసరి గౌరీశంకర్, షేక్ సుభాని మూగభాషలోనే ఆమెను మాటల్లో పెట్టారు. ఎందుకొచ్చావంటూ ప్రశ్నించారు. తాము అన్నీ దగ్గరుండి చూసుకుంటామని నమ్మబలికారు. కంటి వైద్యం చేయిస్తామని మాయమాటలు చెప్పారు. అమాయకంగా ఆమె గౌరీశంకర్ ఇంటికి నడిచింది. అతని వెంట సుభాని కూడా జతకలిశాడు. ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె బిగ్గరగా కేకలేసి, తలుపులు బాది, తప్పించుకునేందుకు ప్రయత్నించింది. దీంతో పక్క ఇళ్లవారు అప్రమత్తమయ్యారు. వారుకూడా ఏం జరుగుతోందో తెలుసుకోడానికి తలుపులు కొట్టడంతో నిందితులిద్దరూ పరారయ్యారు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న చుట్టుపక్కల వారు లాలాపేట పోలీసులకు సమాచారం అందించారు. ఆమె భాష అర్థంకాక పోవడంతో దివ్యాంగులకు శిక్షణనిచ్చే టీచర్ ద్వారా ఆమె నుంచి పూర్తి సమాచారాన్ని లాలాపేట పోలీసులు నమోదు చేశారు. నిందితులిద్దరిపై చార్జిషీటు దాఖలైంది. విచారణలో భాగంగా ఆమె వాంగ్మూలాన్ని టీచర్ ద్వారా వీడియో రికార్డింగ్ కూడా చేయించారు. జిల్లాలో ఈ తరహా కేసు ఇదే మొదటిది. మొత్తమీద ఆ కేసులో సాక్ష్యాలన్నీ బలంగా ఉండటంతో పాటు దివ్యాంగురాలనే కనికరం కూడా లేకుండా ఇంతటి దారుణానికి ఒడిగట్టిన దోషులు గౌరీశంకర్, సుభానిలకు చెరో 22 ఏళ్ల జైలుశిక్ష, 5 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎం రఫీ సోమవారం సంచలనాత్మక తీర్పు వెలువరించారు. సాధారణంగా ఈ తరహా కేసుల్లో 20 ఏళ్ల గరిష్ఠ శిక్ష మాత్రమే విధించే అవకాశముంటుంది. అయితే కేసు తీవ్రత దృష్ట్యా దోషులిద్దరికీ మరో రెండేళ్లు అదనంగా జైలుశిక్ష విధించారు. కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రాసిక్యూషన్ నిర్వహించిన జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్‌ను ఈసందర్భంగా న్యాయవాదులు అభినందించారు.