ఆంధ్రప్రదేశ్‌

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ), ఆగస్టు 19: విశాఖ ప్రభుత్వ ఈఎన్‌టి ఆసుపత్రిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆసుపత్రికి సంబంధించిన సెంట్రల్ ఆక్సిజన్ బ్లాక్‌లో శనివారం ఉదయం ఓక్కసారిగా మంటలు చెలరేగడంతో ఓపికి వచ్చిన రోగులంతా పరుగులు తీశారు. ఆసుపత్రిలో ఆపరేషన్ బ్లాక్‌కు సరఫరా అయ్యే సెంట్రల్ ఆక్సిజన్ బ్లాక్‌లో శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. దీంతో అయోమయంలో పడిన ఏం జరిగిందో తెలియక రోగులు, సిబ్బంది ఆసుపత్రి నుంచి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ రామకృష్ణ, అనస్థీషియన్ రమేష్ స్పందించారు. సెంట్రల్ ఆక్సిజన్ బ్లాక్ నుంచి సరఫరాను నిలిపివేసి మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఆక్సిజన్ సరఫరా చేసే బోర్డులో షార్ట్‌సర్క్యూట్ కావడంతోనే పూర్తిగా కాలిపోయిందిని ప్రాథమికంగా తేలింది. సంఘటన స్థలానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునాథబాబు వచ్చి ప్రమాదం గురించి తెలుసుకొన్నారు. ఈ విషయం అప్పటికే టివి ఛానళ్లలో ప్రసారం కావడంతో నేరుగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆసుపత్రి వర్గాలతో సంప్రదించి ప్రమాదం ఏలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. తక్షణమే నివారణ చర్యలు చేపట్టి రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సంఘటనకు సంబంధించి నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు. అయితే ఈ ఆసుపత్రిలో ఇంత వరకు పూర్తి స్థాయిలో ఫైర్‌కు సంబంధించి పరికరాలేమి లేకపోయినప్పటికీ ఘోర ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ముఖ్యంగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ సమస్య కారణంగా పదుల సంఖ్యలో శిశువులు మృతి చెందిన నేపథ్యంలో ఈ ప్రమాదానికి ప్రాధాన్యం సంతరించుకుంది.