ఆంధ్రప్రదేశ్‌

ఒబిసిల సంక్షేమానికి బిజెపి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: రాష్ట్రంలో ఒబిసిల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందని బిజెపి నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. ఈ నెల 28న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే ఒబిసి సదస్సుకు రాష్ట్రంలోని అన్ని కుల సంఘాల నేతలు, ఒబిసిలు తరలిరావాలని పిలుపిచ్చారు. బిజెపి విజయవాడ నగర కార్యాలయంలో ఆదివారం ఒబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు జల్లి మధుసూదన్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర సంఘటన కార్యదర్శ జిఆర్ రవీంద్రరాజు రాష్ట్రంలోని 17 జిల్లాల ఒబిసి కమిటీలు, మండల కమిటీల విషయాలను సమగ్రంగా చర్చించి తగినవిధంగా పనిచేస్తే సంఘాన్ని ముందుకు తీసుకెళతామని అన్నారు. మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా సుమారు 55 శాతం నుంచి 60 శాతం వరకు బిసిలే ఉన్నారని, రాజ్యాధికారమే ధ్యేయంగా వీరు పనిచేయాలన్నారు. ఆర్థికంగా వెనుకబడి వున్నందున బిసిలని గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ బిసి కమిషన్‌కు చట్టబద్ధత కల్పంచారన్నారు. ఆర్థికంగా బిసి కుటుంబాలు ఎదిగేలా కృషి చేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేవంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె కపిలేశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శి కె కోటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ, ఒబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాలపాటి రవికుమార్, కె సురేష్‌కుమార్, ఆర్ రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు సిహెచ్ సుశీలమ్మ, జగ్గారపు రామమోహన్ తదితరులు పాల్గొన్నారు.