ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం నిధులు దుర్వినియోగం: ఎమ్మెల్సీ సోము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, మే 16: నరేంద్రమోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పథకాలకు సమకూరుస్తున్న నిధులను చంద్రబాబు ప్రభుత్వం అతి తెలివిగా తమ పథకాలకు మళ్లించుకుంటుందని బిజెపి సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు ఆరోపించారు. అనకాపల్లిలో సోమవారం జరిగిన బిజెపి కార్యకర్తల విస్తృత సమావేశంలో మాట్లాడారు. డ్వాక్రా సంఘాలను పివి నర్సింహారావు ప్రభుత్వం హయాంలో ప్రవేశపెడితే ఆ పథకం అమలు ఘనత తమదేనని అప్పట్లో చంద్రబాబు చెప్పుకున్నారని విమర్శించారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుండి అనూహ్యంగా నిధులు సమకూరాయని తెలిపారు.రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ రోడ్ల అభివృద్ధికి పెద్దమొత్తంలో నిధులు కేటాయించారని గుర్తు చేశారు. కొత్తగా రాజధాని నిర్మాణం జరిగే అమరావతిలో ఎనిమిది ప్రధాన రహదారుల అభివృద్ధికి 500 కోట్లు మంజూరు చేసిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు. ఎపీలో విద్యుత్ కొరత లేకపోవడం, ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్లు, ఎన్‌ఆర్‌ఇజిఎస్ తదితర ఎన్నో పథకాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు సమకూర్చిందని పేర్కొన్నారు.