ఆంధ్రప్రదేశ్‌

కృష్ణానదిలో మునిగి పాలిటెక్నిక్ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఆగస్టు 20: కృష్ణా జిల్లా పులిగడ్డ వార్పు వద్ద కృష్ణానదిలో స్నానానికి వెళ్లిన పాలిటెక్నిక్ విద్యార్థి దుర్మరణం చెందాడు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కర్రోకు గ్రామానికి చెందిన తోపాటి హరిప్రసాద్(17) స్థానిక కొత్తపేట రోడ్డులోని బిసి కళాశాల విద్యార్థుల వసతిగృహంలో ఉంటూ దివిసీమ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం స్నేహితులు దిగమర్రు సాయి, గాలం వెంకటేశ్వరరావు, చర్ల యుగంధర్‌తో కలిసి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో సరదాగా పులిగడ్డ వార్పు వద్ద కృష్ణానదిలోకి దిగి స్నానం చేశారు. సహచర విద్యార్థులంతా ఒడ్డున స్నానం చేస్తుండగా హరిప్రసాద్ నదిలో కొంత లోతుగా వెళ్లాడు. ఇలా రెండుసార్లు లోతైన ప్రదేశంలో స్నానం చేసి వచ్చాడు. మూడోసారి స్నేహితులను కూడా రమ్మనగా వారు నిరాకరించటంతో హరిప్రసాద్ ఒక్కడే వెళ్లి స్నానం చేశాడు. ఈక్రమంలో హరిప్రసాద్ గల్లంతయ్యాడు. దీన్ని గమనించిన సహచర విద్యార్థులు కేకలు పెట్టారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ ఖాదర్ బాషా ఘటనాస్థలికి వచ్చి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు హరిప్రసాద్ మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం కోసం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతిపై ఆర్డీవో సాయిబాబు విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రిలో హరిప్రసాద్ మృతదేహాన్ని సందర్శించి కారణాలను స్నేహితుల్ని అడిగి తెలుసుకున్నారు.
చెరువులో వ్యక్తి గల్లంతు
కూచిపూడి : కృష్ణా జిల్లా మొవ్వ జెజె నగర్‌లో నివశిస్తున్న చేబ్రోలు కోటేశ్వరరావు(55) ఆదివారం మధ్యాహ్నం చెరువులో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. అదే సమయంలో కొందరు యువకులు కూడా స్నానం చేస్తున్నారు. కోటేశ్వరరావు ఉత్సాహంతో లోతుకు వెళ్లాడు. అక్కడ కాళ్లకు నేల అందక ఆందోళనతో కేకలు వేశాడు. అతన్ని రక్షించేందుకు యువకులు చేసిన ప్రయత్నం విఫలం కావటంతో సమీపంలోని అగ్నిమాపక సిబ్బందికి తెలియపర్చారు. కూచిపూడి ఎస్‌ఐ అనిల్‌కుమార్, తహశీల్దార్ వి రామానాయక్ చెరువు వద్దకు చేరుకొని అగ్నిమాపక సిబ్బంది ద్వారా వెతికించినా కోటేశ్వరరావు జాడ దొరకలేదు.