ఆంధ్రప్రదేశ్‌

పిఆర్‌సి బకాయిలు వెంటనే చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిపడిన 10 నెలల పిఆర్‌సి బకాయిలు వెంటనే చెల్లించాలని, పెన్షనర్లకు అదనపు పెన్షన్ మంజూరు చేయాలని, స్వయం పోషక స్వతంత్ర పాఠశాలల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం డిమాండ్ చేసింది. ఆదివారం స్థానిక యుటిఎఫ్ కార్యాలయం చెన్ను భవన్‌లో ఐ వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 2018 జూలై నుండి 11వ పిఆర్‌సి అమలు చేయాల్సిన నేపథ్యంలో 10వ పిఆర్‌సి బకాయిలు వెంటనే చెల్లించాలని, 10వ పిఆర్‌సి సిఫార్సుల మేరకు మరికొన్ని ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉందన్నారు. సిపిఎస్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 1న జరుగుతున్న ‘మిలియన్ మార్చ్’ని జయప్రదం చేయాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్ర విభజన వల్ల తమ సొంత రాష్ట్రానికి బదిలీ కోరుకునే వారందరినీ బదిలీకి అనుమతించాలని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే స్వయం పోషక స్వతంత్ర పాఠశాలల చట్టం-2017 ఉచిత విద్యకు తిలోదకాలిస్తుందని, కనుక దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, 1984-1996 మధ్య నియామకమైన స్పెషల్ టీచర్ల సర్వీస్‌కు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, 2008 డిఎస్సీ హామీ పత్రాలు పొందిన వారికి వేతన రక్షణ కల్పించాలని, ఎయిడెడ్ ఉపాధ్యాయుల జీతాలపై బడ్జెట్ కంట్రోల్ తొలగించాలని, మున్సిపల్ పాఠశాలల్లో సమాంతర మీడియంలను కొనసాగించాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సదుపాయం వర్తింపచేయాలని, ఏజెన్సీ పోలవరం ముంపు మండలాల్లో స్పెషల్ డిఎస్సీ నియామకాలు వెంటనే చేపట్టాలని, మున్సిపల్, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులను ఉమ్మడి సర్వీస్ రూల్స్‌లో చేర్చాలని, పాఠశాలల ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ విడుదల చేయాలని, ఇటీవల బదిలీ అయిన వారందరినీ రిలీవ్ చేయాలని, అర్ధ జీతపు సెలవు ఎన్‌క్యాష్‌మెంట్ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశంలో తీర్మానించారు. కార్యదర్శి నివేదికను ప్రధాన కార్యదర్శి పి బాబురెడ్డి ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు చర్చించి ఆమోదించారు. విద్యా ముసాయిదా చట్టం-2017ను వ్యతిరేకిస్తూ రాష్టవ్య్రాప్తంగా సదస్సులు నిర్వహించాలని, ఎస్‌టిఎఫ్‌ఐ పిలుపు మేరకు మహిళలు వినియోగించే నాప్‌కిన్స్‌పై వేసిన జిఎస్టీ పన్ను రద్దుచేయాలని కోరుతూ మహిళలు, బాలికలు ఈ నెల 31న జిల్లా, డివిజన్ కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని కౌన్సిల్ సమావేశం పిలుపునిచ్చింది. గౌరవాధ్యక్షుడు ఎన్ నర్సింహుడు, సహాధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు, కోశాధికారి కె సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కెఎస్‌ఎస్ ప్రసాద్, ఎస్‌కె సాబ్జీ, మహమ్మద్ జిలానీ, ఎస్ జయప్రభ, గొంటి గిరిధర్, బి లక్ష్మీరాజా పాల్గొన్నారు.