ఆంధ్రప్రదేశ్‌

పోలీసులు అడ్డు తొలగేవరకు చలో కిర్లంపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఆగస్టు 21: చలో అమరావతి పాదయాత్రకు పోలీసులు అడ్డుతొలగే వరకు చలో కిర్లంపూడి కార్యక్రమాన్ని కొనసాగించాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కోరారు. కాపులను బిసిల్లో చేర్చాలని తలపెట్టిన పాదయాత్రను 27వ రోజు సోమవారం కూడా పోలీసులు అడ్డుకున్నారు. వారు అడ్డుకున్న చోటే జెఎసి సభ్యులతో కలిసి ముద్రగత బైఠాయించారు. ఈక్రమంలో ముద్రగడకు మద్దతుగా ఉభయగోదావరి జిల్లాల నుండి వందలాదిగా ఆ సామాజిక వర్గీయులు తరలివచ్చారు. వారినుద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ పాదయాత్రకు అనుమతిచ్చేదాకా చలో కిర్లంపూడి పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి తరలిరావాలని పిలుపునిచ్చారు. కేసులకు, పోలీసులకు భయపడకుండా ఉద్యమాన్ని కొనసాగించాలని కోరారు. ఉద్యమానికి మహిళలు బాసటగా నిలుస్తున్నారని, మహిళా స్ఫూర్తితో రిజర్వేషన్లు సాధించుకోవచ్చన్నారు. యువత వారు నిర్వహించిన నిరసన కార్యక్రమాలను వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ఇతరులకు తెలియచేయాలన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి ఎంత ఆరాటపడ్డారో అదే ఆరాటంతో మనం బిసి రిజర్వేషను సాధించుకోడానికి ఉద్యమం కొనసాగించాలన్నారు. కాగా సోమవారం కిర్లంపూడికి మహిళలు వందలాదిగా తరలివచ్చి ముద్రగడకు మద్దతుపలికారు. అనపర్తి నియోజకవర్గం నుండి కాపు యువత మోటారు సైకిళ్లపై ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తూర్పు విప్పర్రు, ఇరగవరం, వరిఘేడు, తణుకు, బల్లిపాడు, తిరుపతిపురం, పైడిపల్లి తదితర గ్రామాల నుండి కాపు నాయకులు ఆశేటి నరసింహారావు, ఆశేటి సత్యం, కర్రి సూర్యనారాయణ, శిరగం శ్రీను, గంధం నాగేశ్వరరావు, జవ్వాది సురేష్ తదితరుల సారధ్యంలో భారీ సంఖ్యలో ముద్రగడను కలిసి సంఘీభావం తెలిపారు.

చిత్రం..బైఠాయింపులో ఉన్న ముద్రగడకు సంఘీభావం తెలుపుతున్న కాపు మహిళలు