ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, ఆగస్టు 21: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి క్షేత్రం సోమవారం భక్తజన సంద్రమైంది. సోమవారం అమావాస్య, సూర్యగ్రహణం, శ్రావణమాసం కావడంతో వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక క్యూలు, సాధారణ క్యూలు నిండిపోయాయి. స్వామి, అమ్మవార్ల దర్శనానికి 5 గంటలకుపైగా సమయం పట్టింది. రాహు-కేతు పూజలకు కూడా రద్దీ ఏర్పడింది. సాయంత్రం 5 గంటలకే 5000 వేల మందికి పైగా పూజలు చేయించుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన 3 కాలాల్లో 918 రుద్రాభిషేకాలు జరిగాయి. రుద్రాభిషేకాలు ఇంత భారీ సంఖ్యలో జరగడం ఇదే మొదటిసారి. సాయంత్రం 5 గంటల తరువాత జరిగే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకానికి కూడా వేల మంది తరలివచ్చారు. అదనపు క్యూలైన్లు ఏర్పాటుచేసినా ఇబ్బందులు తప్పలేదు. దీనికితోడు అభిషేకాలు జరుగుతుండటంతో దర్శనం మరింత ఆలస్యమైంది. ఆలయ అధికారులు, సిబ్బంది, ట్రస్టుబోర్డు సభ్యులు క్యూలైన్లను పరిశీలించి భక్తులు ఇబ్బందులు పడకుండా చూశారు. అయితే వేల మంది భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ప్రముఖ సినీనటుడు అల్లరి నరేష్ సతీసమేతంగా ప్రత్యేక రాహు-కేతు పూజలు చేయించుకొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సినీగాయని స్మిత కూడా ఆలయాన్ని సందర్శించారు. పవిత్రమైన రోజు కాబట్టి స్వామి, అమ్మవార్లను దర్శిస్తే మంచి జరుగుతుందనే పెద్దలు చెప్పడంతో ఆలయానికి వచ్చినట్లు అల్లరి నరేష్ తెలిపారు.

చిత్రం..శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు-కేతు పూజలు చేయించుకుంటున్న సినీనటుడు అల్లరి నరేష్