ఆంధ్రప్రదేశ్‌

పివిఆర్‌కెకు ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 21: టిటిడి కార్యనిర్వహణాధికారిగా అనేక సంస్కరణలు చేపట్టి ఇటు భక్తులకు, ఉద్యోగులకు, స్థానికులకు గొప్ప సౌకర్యాలు కల్పించిన ఘనత పివిఆర్‌కె ప్రసాద్‌కే దక్కుతుందని ఇఓ ఎకె సింఘాల్ ఘన నివాళి అర్పించారు. సోమవారం స్థానిక అన్నమయ్య భవన్‌లో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో ముందుగా పివిఆర్‌కె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింఘాల్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావాలు మెండుగా ఉన్న పివిఆర్‌కె ప్రసాద్ మృతి తీరని లోటన్నారు. 1978 నుంచి 1982 వరకు టిటిడి కార్యనిర్వహణాధికారిగా పివిఆర్‌కె అందించిన సేవలు శ్లాఘనీయమన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు సంస్కరణలు చేపట్టిన మహనీయుడన్నారు. అలాగే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్ట్, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్‌లు పివిఆర్‌కె ప్రసాద్ కృషి ఫలితంగానే ఏర్పడినవన్నారు. ఇక తిరుమలలో మాస్టర్‌ప్లాన్ అమలుచేయడంలో అనేక సవాళ్లను ఎదురొడ్డి అమలు చేశారన్నారు. శ్రీవారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన అనే ఆర్జిత సేవను ప్రవేశపెట్టారన్నారు. పివిఆర్‌కె రచించిన ‘నాహం కర్తా, హరి కర్త’ అనే పుస్తకానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. అందుకు కారణం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామితో ఆయనకున్న వాస్తవ అనుభవాలను, భక్త్భివాన్ని క్రోడీకరించడమేనని అన్నారు.