ఆంధ్రప్రదేశ్‌

కన్నబాబుపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), ఆగస్టు 21: విశాఖ జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రమణమూర్తిరాజు ఎలియాస్ కన్నబాబుపై అప్పు తీసుకుని చెల్లించనందుకు పోలీసు కేసు నమోదైంది. రూ.50 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేసిన రమణమూర్తిరాజుపై విశాఖలోని ద్వారకా పోలీసు స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ద్వారకానగర్‌లో నివాసముంటున్న రాజన్నబాబు సరోజినీ ఇంజనీరింగ్ వర్క్స్ నడుపుతున్నారు. 2010 సెప్టెంబర్ 9న రాజన్నబాబు నుండి కన్నబాబు రూ.50 లక్షలను అప్పుగా తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కన్నబాబు అనుచరుడు రామాల మూలరాజు ఖాతాలోకి రూ.50 లక్షలను రాజన్నబాబు జమ చేసినట్టు పోలీసులకు ఎకౌంట్ వివరాలను చూపించారు. అయితే ఉదయం 11.30 గంటల సమయంలో సీతమ్మధారలోని నార్త్ ఎక్స్‌టెన్షన్ లే-అవుట్‌లో ఉంటున్న కన్నబాబు ఇంటికి రాజన్నబాబు వెళ్లాడు. డబ్బుల కోసం నేరుగా ఇంటికే వస్తావా అని కోపంతో కన్నబాబు ఊగిపోతూ రాజన్నబాబుపై దాడి చేయడంతోపాటు తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరించినట్టు పోలీసులకు రాజన్నబాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రాథమిక విచారణ జరిపి కన్నబాబుపై కేసు నమోదు చేసినట్టు ద్వారకా స్టేషన్ ఎస్సై ఆడపా సత్యారావు తెలిపారు.