ఆంధ్రప్రదేశ్‌

‘కారం’ నియామకంపై వివరణ కోరిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారం శివాజీ నియామకంపై రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ వివరణ కోరింది. కారం శివాజీ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్‌పై జస్టిస్ చల్లా కోదండరాం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. వైజాగ్‌కు చెందిన కె రాజారావు దాఖలు చేసిన ప్రజావాజ్య పిటీషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఈ విషయంలో ప్రభుత్వం తన వాదన వినిపించాలని ఆదేశించారు.
సర్వేల నిషేధంపై జోక్యం చేసుకోలేం
నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్‌కు ముందే నిర్వహిస్తున్న సర్వేలను నిషేధించేలా చూడాలని దాఖలైన పిటీషన్‌పై జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. స్పార్క్ ఎన్‌జిఓ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ అయిష్టత వ్యక్తం చేసింది.