ఆంధ్రప్రదేశ్‌

అంబులెన్సులో గంజాయి తరలింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, ఆగస్టు 21: అంబులెన్సు, మరో వాహనంలో తరలిస్తున్న 610 కిలోల గంజాయిని తూర్పు గోదావరి జిల్లా చింతూరు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఒడిస్సా రాష్ట్రంలోని మల్కన్‌గిరి ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. చింతూరు సిఐ కె దుర్గాప్రసాద్, ఎస్సై పి శ్రీనివాస్‌కుమార్ సిబ్బందితో కలిసి చింతూరు-్భద్రాచలం జాతీయ రహదారిలోని గొర్లగూడెం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అంబులెన్స్, తూపాన్ వాహనాల్లో గంజాయిని గుర్తించారు. అంబులెన్స్‌లో 25 గోనె బస్తాల్లో 600 కిలోలు, తూపాన్ వాహనంలో పది కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న పి శ్రీనివాస్, సి రమేష్, అహ్మద్ బాషా, మహ్మద్ అస్రార్, చెరుకుపల్లి సాయికుమార్, డి సుమన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితుల నుంచి రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.18.3లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా. తహసీల్దార్ తేజేశ్వరరావు ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు.

చిత్రం..అంబులెన్స్‌లో రవాణాచేస్తున్న గంజాయి బస్తాలు