ఆంధ్రప్రదేశ్‌

యానాది కాలనీవాసుల తరలింపు ఆపాలి: చిరంజీవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 21: స్థానిక యానాదికాలనీలో ఏడు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను కూలగొట్టి, అక్కడి నివసిస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం, నగరపాలక సంస్థ అధికారులు అనుసరిస్తున్న తీరు అమానుషమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.చిరంజీవి పేరుతో సోమవారం ఒక ప్రకటన విడుదలైంది. తిరుపతి నడిబొడ్డున యానాదులు నివసించడాన్ని జీర్ణించుకోలేకే ప్రభుత్వం వారి ఇళ్లను కొట్టివేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తోందన్నారు. ఇది వివక్షతో కూడుకున్న కుట్ర అన్నారు. నగరంలోని 18వ వార్డులో గత 70 సంవత్సరాలుగా 160 యానాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయన్నారు. వారికి తగిన సౌకర్యాలను కల్పించడం మాని, వారి ఇళ్లను ఖాళీ చేయించి బలవంతంగా తరలించడం సరికాదన్నారు. దీని వెనుక మహాకుట్ర ఉందన్నారు. యానాదులు నివాసం ఉంటున్న విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని ఆరోపించారు. తిరుపతి నడిబొడ్డున ఉన్న వారిని తరిమివేయడానికి పునరావాసం పేరుతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు. తాను తిరుపతి శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో యానాది కాలనీలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టానని తెలిపారు.