ఆంధ్రప్రదేశ్‌

చిరస్మరణీయంగా బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 21: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తులకు చిరకాలం గుర్తుండేలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. టిటిడి ఇఓ, జెఇఓలు, సివిఎస్‌ఓలతోపాటు జిల్లా పాలనాధికారి ప్రద్యుమ్న, పోలీస్, ఆర్టీసీ, శ్రీవారి ప్రధాన అర్చకులు తదితరులు ఈసమావేశంలో పాల్గొని సుమారు రెండు గంటలపాటు ఏర్పాట్లపై విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో ఇఓ సింఘాల్ మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున అలంకరించే ప్రభుత్వం తరపున అందించే పట్టువస్త్రాలను సిఎం చంద్రబాబు నాయుడు ఉత్సవాల్లో తొలిరోజైన 23న జరిగే ధ్వజారోహణం రోజున సమర్పించడానికి వస్తారన్నారు. తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు ఇప్పటికే ఏర్పాట్లపై పలు పర్యాయాలు అధికారులతో చర్చలు జరిపారన్నారు. ఉత్సవ ఏర్పాట్లకు రూ. 8 కోట్ల నిధులు కేటాయించామని, ఆ పనులన్నీ మరో 15 రోజుల్లో పూర్తవుతాయన్నారు. ఇక ఈ బ్రహ్మోత్సవాల్లో నూతనంగా తయారుచేసిన సర్వభూపాల వాహనాన్ని వినియోగించనున్నామన్నారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు వసతి, దర్శన, భోజన సౌకర్యాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. భద్రత విషయంలో కూడా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. మాడవీధుల్లో గ్లాలరీల్లోకి వెళ్లడానికి ఎలాంటి తోపులాటలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతేడాది ఆర్టీసీ 3500 ట్రిప్పులు తిరుపతి-తిరుమల మధ్య తిరిగాయన్నారు. ఈ ఏడాది 550 బస్సులతో 4 వేల ట్రిప్పులు నడిపేలా ఆర్టీసీ ఆధికారులకు సూచనలు చేసినట్లు చెప్పారు. భద్రతా చర్యల్లో భాగంగా నాలుగు మాడవీధుల్లోను, తిరుమల అంతటా కూడా 600 సిసి కెమేరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 3వేల మంది శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటామన్నారు. గరుడ సేవ రోజున యథావిధిగా ద్విచక్ర వాహనదారులను అనుమతించబోమన్నారు. అన్నప్రసాదం, జలప్రసాదం, రవాణా, వైద్య సౌకర్యాలతోపాటు అంబులెన్స్‌లతోపాటుగా అదనపు తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇక గరుడ సేవ రోజున గ్యాలరీల్లో ఉన్న భక్తులకు 6 లక్షల తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రొటోకాల్ పరిధిలోని వారిని మాత్రమే బ్రేక్ దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఇక శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ద్వారా స్వామివారి ఉత్సవాల వైభవాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, ఇతర చానల్స్‌లో కూడా ఉత్సవాల ప్రసారాలు ఉంటాయన్నారు. అంతకుమునుపు జెఇఓ శ్రీనివాసరాజు బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన గరుడసేవ, చక్రస్నానం, వాహన సేవలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఎల్‌ఇడి తెరలు, మాడవీధుల్లోకి భక్తుల ప్రవేశం, గ్యాలరీలు తదితర అంశాలకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లపై సవివరంగా తెలియజేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు జరుగునున్న బ్రహ్మోత్సవాలపై రూపొందించిన గోడపత్రికను తిరుమల అన్నమయ్య భవనంలో టిటిడి ఇఓ, జెఇఓలు, కలెక్టర్, సివిఎస్‌ఓలు ఆవిష్కరించారు.