ఆంధ్రప్రదేశ్‌

జల సంరక్షణకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: నీరు-ప్రగతి, నీరు-చెట్టు, జలసంరక్షణ కార్యక్రమాల ద్వారా రెండేళ్ల కాలంలో రూ.2,893 కోట్లు ఖర్చుచేసి 3లక్షల 60వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం నిజాయతీగా పనులు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దేందుకు పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసేలా పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కరవు పరిస్థితుల నేపథ్యంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో అసంపూర్తి ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలని రాష్టవ్య్రాప్తంగా పర్యటిస్తున్నారన్నారు. గ్రామ, మండల స్థాయిలో భూగర్భ జలాల స్థాయిని పెంచేలా జలసంరక్షణ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాముల్ని చేస్తున్నామన్నారు. జలసంరక్షణలో భాగంగా ముఖ్యమంత్రి 11 జిల్లాల్లో పర్యటించారని, ఈ నెల 18న తూర్పుగోదావరి జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని ఉమ వెల్లడించారు. జలసంరక్షణ కార్యక్రమాల్లో గత సంవత్సరం రూ.1266 కోట్లు ఖర్చుచేసి 18 కోట్ల 20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీశామన్నారు. 28,244 చెక్‌డ్యామ్‌లను రూ.211 కోట్ల ఖర్చుతో నిర్మించామన్నారు. 82,964 హార్వెస్టింగ్ నిర్మాణాలకు రూ.825 కోట్లు ఖర్చుచేశామన్నారు. 172 ఎత్తిపోతల పథకాలకు రిపేర్లు నిర్వహించేందుకు రూ.311 కోట్లు వెచ్చించామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రూ.198 కోట్లు ఖర్చుచేసి 4కోట్ల 70లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీశామని, 7 ఎత్తిపోతల పథకాలకు రూ.64 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఏప్రిల్, మే నెలల్లోనే నీరు-చెట్టు, నీరు-ప్రగతి కార్యక్రమాల ద్వారా రూ.664 కోట్లు ఖర్చు చేశామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించకుండా విమర్శలు చేయటం విడ్డూరమని ఆయన ఖండించారు. గత ప్రభుత్వాలు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు సరైన వాదనలు వినిపించకపోవడంతో రాష్ట్రం నష్టపోయిందని, ప్రతిపక్ష నేత ప్రజలను మోసగించేందుకే జలదీక్ష చేపట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల హక్కులను కాపాడుతుందని మంత్రి చెప్పారు.