ఆంధ్రప్రదేశ్‌

279 జీవో రద్దు చేయకుంటే 16 నుంచి నిరవధిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: మున్సిపల్ కార్మికులను వీధులపాలు చేసే 279 జీవోను వచ్చేనెల 15లోపు రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆ మరుసటిరోజు 16 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తారని మున్సిపల్ జెఎసి, ఇతర కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. మున్సిపాలిటీలు, నగరాల్లో పారిశుద్ధ్య పని నిర్వహణను ఈ జిఓ ద్వారా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ముందుకు వెళ్తే రానున్న రోజుల్లో మున్సిపల్ కార్మికులు చంద్రబాబు ప్రభుత్వానికి సమాధి కడతారన్నారు. ఏపి మున్సిపల్ ఎంప్లారుూస్ అండ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల గర్జన సభ మంగళవారం విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగింది. దీనికి ముందుగా రైల్వే స్టేషన్ నుంచి భారీ ర్యాలీ జరిగింది. ఈ ధర్నాకు జెఎసి నాయకులు, ఏపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లారుూస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఏపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు, ఇ.మధు నేతృత్వం వ్యవహరించారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ శానిటేషన్ కార్మికులు చేస్తున్న పోరాటానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీలుగా సంపూర్ణ మద్దతునిస్తున్నామన్నా. మరో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాన్ని అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామన్నారు. వచ్చే నెల 15 వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నారని, అప్పటికీ రద్దు చేయకుంటే 16 నుంచి రాష్ట్రంలోని 40వేల మంది కార్మికులు సమ్మెలోకి దిగి మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులను స్తంభింప చేస్తారని హెచ్చరించారు.