ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా హెల్త్ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే పూర్తిస్థాయిలో అన్నిరంగాల్లోనూ రాణించగలుగుతారని, విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా హెల్త్ కార్డులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లాలో పైలెట్ ప్రాతిపదికన 71వేల మందికి పైగా విద్యార్థులకు హెల్త్ కార్డులను అందించనున్నట్లు స్పష్టం చేశారు. దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు లభిస్తాయని, తద్వారా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. సెప్టెంబర్ 1లోపు జిల్లాలకు పూర్తిస్థాయి డిఈవోలను నియమించేలా సత్వర చర్యలను చేపట్టాలని ఆదేశించారు. 11 జిల్లాల్లో ఇన్‌చార్జ్ డిఈవోలు ఉన్నారని, ఈ క్రమంలో విద్యారంగ ఉన్నతి కోసం పూర్తిస్థాయి డిఈవోలను నియమించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం యాన్యుటి ప్రాతిపదికన రూ.4,848 కోట్లు ఖర్చు చేయనున్న నేపధ్యంలో సిఎం నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పైలాన్‌ను ఆవిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఎక్కడ పైలాన్‌ను ఆవిష్కరించాలనే అంశంపై చర్చించి పాఠశాలను ఎంపిక చేయాలని మంత్రి ఆదేశించారు. కెజిబివిలు, మోడల్ స్కూళ్లు, ఎపిఆర్‌ఇఐఎస్‌లలో 8 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా ఫౌండేషన్ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. బయోమెట్రిక్‌తో ఆధార్ అనుసంధానం, వర్చువల్ తరగతులు, డిజిటల్ స్కూళ్లు, మోడల్ పాఠశాలల హాస్టళ్లతో పాటు పలు అంశాలపై మంత్రి చర్చించారు. రాష్ట్రంలోని అన్ని హైస్కూళ్లలో వర్చువల్ తరగతులు సెప్టెంబర్ 5న జరిగే ఉపాధ్యాయ దినోత్సవం, అమ్మకు వందనం కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.