ఆంధ్రప్రదేశ్‌

పాఠశాల విద్యాశాఖ సర్వీస్ రూల్స్ ముసాయిదా 29 నాటికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: పాఠశాల విద్యాశాఖ సర్వీస్ రూల్స్ ముసాయిదా ఈనెల 29కి విడుదల చేస్తామని సర్వీస్ రూల్స్ కమిటీ కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంవి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం విజయవాడలోని ఓ హోటల్‌లో సర్వీస్ రూల్స్ కమిటీ ఎంవి సత్యనారాయణ అధ్యక్షతన సమావేశమైంది. ఈనెల 29 నాటికి విద్యాశాఖ రూల్స్ ముసాయిదా విడుదల చేయాలని, సెప్టెంబర్ 9 నాటికి అభిప్రాయాలు సేకరించాలని, సెప్టెంబర్ 13 తేదీ కమిటీ తిరిగి సమావేశమై సర్వీస్ రూల్స్ ఖరారు చేసి విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలని, జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్ అవకాశాలు ఇప్పించాలని, గిరిజన సంక్షేమ, మున్సిపల్ ఉపాధ్యాయులను ఉమ్మడి సర్వీస్ రూల్స్‌లోకి చేర్చాలని, నియామకాలకు, ప్రమోషన్ల అర్హతల్లో స్పష్టత ఉండాలని సభ్యులు అభిప్రాయపడ్డారు.