ఆంధ్రప్రదేశ్‌

కాకినాడలో గెలిచి తీరాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో అన్ని డివిజన్లలోనూ తెలుగుదేశం పార్టీ గెలిచి తీరాల్సిందేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన కాకినాడ ఎన్నికల నిర్వహణపై ఆ పార్టీ నేతలతో మంగళవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో పార్టీ నేతలు గెలుస్తామని అనుకోవడం వేరని, గెలవడం వేరని గుర్తు చేశారు. అన్ని డివిజన్లలో పార్టీ కచ్చితంగా గెలిచి తీరాలన్నారు. నేతలు అతి విశ్వాసంతో వ్యవహరించవద్దని సున్నితంగా హితవు పలికారు. అన్ని వర్గాలకు అవకాశాలు ఇస్తున్నామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బిజెపికి కేటాయించిన డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు పార్టీ వర్గాలు కృషి చేయాలన్నారు. దీనిపై స్పందించిన మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కాకినాడలో గెలుపునకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నామని వివరించారు. అధిష్ఠానం ఆదేశాలు కింద స్థాయిలో కచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే టిడిపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం ప్రారంభించినట్లు హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు.