ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం పంతులుకి చంద్రబాబు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: తెలుగువారిలో స్వాతంత్య్ర కాంక్ష రగిలించిన నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అగ్రభాగాన ఉంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. బుధవారం ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగువారి ఐక్యతకు ప్రకాశం అవిరళ కృషి చేశారని, ఒక్క భారతీయుడూ లేని సైమన్ కమిషన్‌ను ‘గోబ్యాక్’ అంటూ రణ గర్జన విన్పించారని, ఆ సమయంలో ప్రాణాలకు తెగించి చూపించిన ధైర్యసాహసాలతో తెలుగువారు ఆయన్ని ఆంధ్రకేసరిగా గౌరవించారని కొనియాడారు. గాంధీజీ పిలుపు అందుకుని మన రాష్ట్రంలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారన్నారు. ప్రజలను ప్రేమించని వాడు దేశభక్తుడు కాదన్న ప్రకాశం పంతులు అకళంక దేశభక్తుడని అన్నారు. దేశ శ్రేయస్సు కోసం తన సంపదను, ఎంతో ఆదాయం తెచ్చిపెడుతున్న న్యాయవాద వృత్తిని ప్రకాశం పంతులు త్యజించారని, ఆఖరి శ్వాస దాకా నిస్వార్థంగా జీవించారని కొనియాడారు. చిన్న వయసులో రాజమహేంద్రవరం పురపాలక సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారని, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడేళ్లు జైలుశిక్ష అనుభవించారని గుర్తుచేశారు. రాజ్యాంగం ప్రకారం భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చని, తెలుగు భాష మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వరని నెహ్రూనే నిలదీశారన్నారు. ఆంధ్రకేసరి ప్రవేశపెట్టిన ఫిర్కా అభివృద్ధి పథకం పంచాయతీరాజ్ వ్యవస్థకు నాంది పలికిందని చెబుతూ, జమిందారీ వ్యవస్థ నిర్మూలనకు ఎంతగానో కృషిచేసి విజయం సాధించారన్నారు.
జన్మస్థలంలో నేడు ఘన నివాళి
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహావిష్కరణ ఆయన జన్మస్థలం ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెంలో బుధవారం జరగనున్నది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్ని ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల హ్రాజరవుతున్నారు.