ఆంధ్రప్రదేశ్‌

పిఎంపి, ఆర్‌ఎంపిల శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: పిఎంపి, ఆర్‌ఎంపిలకు కమ్యూనిటీ పారా మెడికల్ ట్రైనింగ్ ప్రొగ్రామ్ కింద శిక్షణ విధి విధానాలు ఖరారు చేసేందుకు ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చైర్మన్‌గా, సభ్యులుగా ఎపివివిపి కమిషనర్, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్, మెంబర్ కన్వీనర్‌గా ఎపి పారామెడికల్ బోర్డు సెక్రటరీ వ్యవహరిస్తారు. ఆర్‌ఎంపి, పిఎంపిలకు చట్టబద్ధత కల్పించడంపై సిఎం చంద్రబాబు నాయుడు సోమవారం హామీ మేరకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. శిక్షణ, పరీక్ష, సర్ట్ఫికేషన్ తదితర అంశాలను ఈ కమిటీ రూపొందిస్తుంది. సర్ట్ఫికేషన్ తరువాత వీరిని కమ్యూనిటీ పారా మెడిక్స్‌గా వ్యవహరిస్తారు.
‘మోడల్’ టీచర్ల జీతాల బకాయిలు విడుదల
విజయవాడ, ఆగస్టు 22: రాష్ట్రంలో పనిచేస్తున్న మోడల్ పాఠశాలల టీచర్లకు మూడు నెలల జీతాలు విడుదల చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జివో 153 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎపిటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. అదే విధంగా సోమవారం విడుదల చేసిన అర్ధ వేతన సెలవుకు నగదు సౌకర్యం 2013, జూలై నుంచి అమలుపరచాలని కోరారు. మోడల్ పాఠశాలల టీచర్లకు జీతాలు విడుదల చేయటం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.