ఆంధ్రప్రదేశ్‌

మహానాడు ఏర్పాట్లు అదిరిపోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: తిరుపతిలో నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లపై పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు సమీక్షించారు. సోమవారం విజయవాడలోని సిఎం కార్యాలయంలో రెండు రాష్ట్రాల మహానాడు కమిటీ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. సభావేదిక బ్యాక్‌డ్రాప్, వాహనాల పార్కింగ్, కార్యకర్తలకు బస, భోజన వసతులు, మంచినీటి వసతి, తదితర ఏర్పాట్లపై కమిటీలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చే నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రయాణ మార్గాలను ముందే గుర్తించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఏ ప్రాంతం వారు ఎక్కడ బసచేసేదీ, వాహన పార్కింగ్ సమాచారం ముందుగానే పంపాలని, అంతా ఆన్‌లైన్‌లో పెట్టాలని సూచించారు. వివిధ జిల్లాల్లో జరిగే మినీ మహానాడులకు ముసాయిదా తీర్మానాలను పంపి వారిచ్చే సలహాలు, సూచనలను కూడా క్రోడీకరించి మహానాడులో ఆమోదించే తీర్మానాలను తయారుచేయాలని చెప్పారు. మీడియా, ప్రజాప్రతినిధులు, మహిళలకు వేదిక ముందే ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేసి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గత రెండేళ్లలో సాధించిన విజయాల గురించి ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. డాక్యుమెంటరీలు ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వ పథకాల గురించి కళారూపాల ద్వారా, సాంస్కృతిక ప్రదర్శనలతో పార్టీ ప్రతినిధుల్లో, కార్యకర్తల్లో ఉత్తేజం నింపాలని కూడా ముఖ్యమంత్రి నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావ్, ఎల్ రమణ, మహానాడు కమిటీల అధ్యక్షులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
చిత్రం మహానాడుకు ఏర్పాట్లపై నాయకులు, మంత్రులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు