ఆంధ్రప్రదేశ్‌

నీటి కాలుష్యం నుంచి మత్స్య సంపదకు రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 16: సముద్రంలో కలుస్తున్న పరిశ్రమల కాలుష్యం నుండి మత్స్యసంపదకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు కేంద్ర ఆహార ఉత్పత్తుల పరిశ్రమల శాఖ మంత్రి జ్యోతి నిరంజన్ సాథ్వి పేర్కొన్నారు. మత్స్యకారులను ఎస్‌టి జాబితాలో చేర్చాలంటూ సోమవారం ఇక్కడి మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన ‘మత్స్యకార మహాగర్జన’ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చేపల వేట జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకారులకు పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం సముద్రంలో కలుస్తుండటంతో మత్స్యసంపద నాశనమవుతోందని, దీంతో వారి జీవనాధారం కోల్పోతుండటం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలోకి విడిచిపెడుతున్న కాలుష్యనీటిని రీసైక్లింగ్ చేసే విధంగా విధాన నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. 2014 జూలైలోనే దీనిపై పార్లమెంటులో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో సముద్రతీర ప్రాంతంలో కాలుష్యకారక పరిశ్రమల ఏర్పాటుపై నిరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాకరాపల్లి ఘటనను ఉదహరిస్తూ మత్స్యకారులు వ్యవస్థలు, వ్యక్తుల మీద పోరాటం కాకుండా వారి జీవనం కోసం బతుకు పోరాటం చేస్తే ప్రభుత్వం వారిపై గుళ్లవర్షం కురిపించడం అత్యంత బాధాకరమన్నారు. ప్రధాని నరేంద్రమోది ఓ సాధారణ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా బడుగు, బలహీన వర్గాల వారి అభ్యున్నతికి ఎంతగానో కృషిచేస్తున్నారని, ఆయన దృష్టికి జిల్లా మత్స్యకారుల పరిస్థితి తీసుకువెళ్తానన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా మత్స్యకారులకు ప్రమాద బీమా వర్తింపజేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తానని హామీనిచ్చారు. ఆమెతో పాటు కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.