ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థుల కోసం వేట...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 16: ఈ ఏడాది అడ్మిషన్ల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ కళాశాలలు తీవ్రస్థాయిలో వేట కొనసాగించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏటా మంచి డిమాండు ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలకు సైతం ఈ సంవత్సరం విద్యార్థుల కోసం వెతుకులాట తప్పేలాలేదు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్ధుల కంటే ఆయా కళాశాలల్లో సీట్లు అధికంగా ఉండటం ఇందుకు కారణం కానున్నది. ఓవైపు ఇంజనీరింగ్ కళాశాలల్లో కౌనె్సలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతుండగా, మరోవైపు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను తమ తమ కళాశాలల్లో చేర్పించుకోవడానికి విశ్వప్రయత్నాల్లో ఉన్నాయి. ఎల్‌కెజి నుండి ఇంటర్ వరకు అడ్మిషన్ల కోసం ఏటా పోటాపోటీగా తిరిగిన ఆయా కళాశాలల ప్రతినిధులు ఇక ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం రోడ్డెక్కనున్నారు. ఇందుకు కో-ఆర్డినేటర్లు, ఇతర సిబ్బందిని నియమించుకుని, అడ్మిషన్ల కోసం గేలం వేసే పనిలో ఉన్నారు. ఎంసెట్-2016 ఫలితాలను ఈనెల 9న విడుదల చేసిన విషయం విదితమే. నీట్ పుణ్యమా అని మెడిసిన్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షల ఫలితాలు నిలిచిపోగా, ఇంజనీరింగ్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 27న అడ్మిషన్స్ నోటిఫికేషన్ జారీ అయిన అనంతరం కౌనె్సలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 17 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో 3,934 సీట్లు, 305 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 1,53,150 సీట్లు ఉన్నాయి. మొత్తం 322 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి 1,57,074 సీట్లు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంజనీరింగ్‌కు సంబంధించి 1,89,246 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,79,465 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,45,510 మంది అర్హత సాధించారు. ఎంసెట్‌కు అర్హత సాధించిన వారిలో 10,033 మంది ఇంటర్ ఉత్తీర్ణులు కాని వారున్నారు. అయితే ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఎంసెట్‌లో అర్హత పొందని వారు 27,231 మంది ఉన్నారు. మొత్తం ఇంజనీరింగ్‌లో 1,31,580 మంది ర్యాంకులు సాధించారు. దీంతో ఉత్తీర్ణులైన విద్యార్థుల కంటే 11,564 సీట్లు అధికంగా ఉండటం గమనార్హం.