ఆంధ్రప్రదేశ్‌

చాగంటిపై అనుచిత వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), మే 17: ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావుపై సద్గురు రమణానంద మహర్షి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అతని శిష్యుడు పిఎస్ నారాయణ ఫిర్యాదు మేరకు ఇక్కడి నాలుగో పట్టణ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదు వివరాలివి. ఈనెల ఐదో తేదీ రాత్రి 9గంటల సమయంలో ఓ భక్తి ఛానల్‌లో నగరానికి చెందిన సద్గురు రమణానందమహర్షి ఆధ్యాత్మిక ప్రసంగం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన చాగంటి కోటేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశా రు. అంతేకాకుండా అతని దిష్టిబొమ్మకు చెప్పులతో కొట్టి అవమానించారు. దీంతో అక్కయ్యపాలెంకు చెందిన చాగంటి శిష్యుడు, సత్సంగం ప్రతినిధి నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు సెక్షన్‌ల కింద రమణానంద మహర్షిపై కేసులు నమోదు చేశారు. రమణానంద మహర్షిపై వచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని, న్యాయనిపుణుల అభిప్రాయం తీసుకుని అవసరమైతే అతనిని అరెస్టు చేస్తామని సిఐ బాలకృష్ణ విలేఖర్లకు తెలిపారు. కాగా, రమణానంద మహర్షికి నగరంలోని బాలయ్యశాస్ర్తీ లేఅవుట్‌లో షిర్డీసాయి ఆశ్రమం ఉంది.