ఆంధ్రప్రదేశ్‌

డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్‌కు ఏడాది జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: పరిశ్రమ శాఖకు చెందిన డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ బి యోగేశ్వర రావుకు ప్రత్యేక ఏసీబీ కోర్టు ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2002లో పరిశ్రమల శాఖకు చెందిన రూ. 46.48 లక్షలు అక్రమాలకు పాల్పడినందుకు గానూ, అతనిపై ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లాలో కేసు నమోదైంది. చార్జిషీటు దాఖలైన దరిమిలా అతనిపై గల అభియోగాలపై వాదోపవాదాల అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏడాది జైలుశిక్షతోపాటు రూ. 10వేల జరిమానా విధించింది. తీర్పు వెలువడిన నాటి నుంచి నాలుగు నెలల లోపు ఆ డబ్బులు కోర్టులో జమ చేయాలని, లేనిపక్షంలో అధికారి ఆస్తులు అమ్మి చెల్లించాల్సి వస్తుందని ఏసిబీ ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు.