ఆంధ్రప్రదేశ్‌

నేడు ఉద్యోగుల మిలీనియం మార్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 31: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్ నుంచి అమల్లోకి తెచ్చిన కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సిపిఎస్)కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఇంతకాలం కొనసాగుతూ వస్తున్న ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ విజయవాడలో ‘మిలీనియం మార్చ్’కు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులు సన్నద్ధమవుతున్నారు. శుక్రవారం నిర్వహించనున్న మిలీనియం మార్చ్‌కు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ షరతులపై ర్యాలీ, బహిరంగ సభకు అనుమతిచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. అనంతరం సిఎం క్యాంప్ కార్యాలయం సమీపంలోని బిషప్ హజరయ్య హైస్కూల్ ప్రాంగణంలో బహిరంగ సభ జరుగనుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా నగరంలో అడుగడుగునా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.