ఆంధ్రప్రదేశ్‌

చాగల్లు షుగర్స్ కార్మికులకు వారం రోజుల్లో వేతన బకాయిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 31: పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు వారం రోజుల్లో రెండు నెలల వేతనాలు చెల్లించాలని యాజమాన్యాన్ని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఆదేశించారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి పితాని సత్యనారాయణ వెలగపూడి సచివాలయంలోని కార్యాలయంలో చాగల్లు మండలంలో ఉన్న జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ (చాగల్లు ఫ్యాక్టరీ) యాజమాన్యం, కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కార్మికులకు జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం యూనియన్ అధ్యక్షుడు ఎన్‌వి కృష్ణారావు మంత్రిని కోరారు. అనంతరం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడిన మంత్రి వారం రోజుల్లో కార్మికులకు 2నెలల వేతనాలు చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అందుకు యాజమాన్యం అంగీకరించింది.