ఆంధ్రప్రదేశ్‌

రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు నేటి నుంచి శిక్షణ శిబిరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 31: ‘సెర్ప్’ ద్వారా ఏర్పాటుచేసిన 18వేల రైతు గ్రూపులకు సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు రాష్టస్థ్రాయి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్టు మహిళా శిశు సంక్షేమ మంత్రి పరిటాల సునీత గురువారం తెలిపారు. గత 15 ఏళ్లకు పైగా విజయవంతంగా నడుస్తున్న మహిళా గ్రూపు విధానంలోనే రైతులను కూడా గ్రూపులుగా సంఘటితపరచి క్రమంగా వారి ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం పేరుతో దీన్ని వెనుకబడిన ప్రాంతాలు, వర్షాధార ప్రాంతాలు, ఎస్‌సి, ఎస్‌టి జనాభా అధికంగా ఉండి, మహిళా అక్షరాస్యత తక్కువగా ఉన్న 157 మండలాల్లో దీన్ని చేపట్టినట్టు తెలిపారు. సంస్థ నిర్మాణం, పాటవ నిర్మాణం, ప్రభుత్వ పథకాలు గురించి నిపుణులతో నిర్వహించబోతున్న ఈ శిబిరాల్లో ఈ గ్రూపులతో పనిచేయనున్న సుమారు 500 మంది సెర్ప్ సిబ్బంది పాల్గొంటున్నారు. తిరిగి వీరు ఆయా గ్రూప్‌లకు గ్రామాల్లో శిక్షణ ఇస్తారు.