ఆంధ్రప్రదేశ్‌

మళ్లీ తెరపైకి వైఎస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 31: మూడున్నరేళ్ల క్రితం వరకూ క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి, తర్వాత పెద్దగా ప్రచారానికి నోచుకోని దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని మళ్లీ తెరపైకి తీసుకువచ్చేందుకు వైసీపీ కన్సల్టెంట్ ప్రశాంత్ కిశోర్ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఆ ప్రకారంగా రాష్ట్రంలోని కోటి మందికి వైసీపీని నేరుగా చేర్చే ‘వైఎస్ కుటుంబం’ పేరుతో ప్రణాళికకు పదునుపెట్టినట్లు ‘పికె’ వర్గాలు తెలిపాయి. వైఎస్ వర్ధంతి రోజయిన సెప్టెంబర్ 2న 3గంటలకు పులివెందులలో ఈ స్కీమును అమలుచేయనున్నారు. వైఎస్ మృతి తర్వాత జగన్ ఓదార్పు, షర్మిల పాదయాత్ర, అనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ 67 సీట్లు సాధించింది. అప్పటివరకూ ఎన్నికల ప్రచారంలో వైఎస్ ఫొటోను విపరీతంగా వినియోగించుకుని, ఆ సానుభూతి ఓట్లు దక్కించుకున్న వైసీపీ నాయకత్వం, ఎన్నికల తర్వాత కొద్ది నెలలకే ఆయన నామస్మరణ మానేసింది. అయితే, నంద్యాల ఉప ఎన్నికలో దారుణ పరాభవం తర్వాత కంగుతిన్న జగన్.. పార్టీకి దూరమవుతున్న ముస్లింలు, చీలిక వచ్చిన దళితులను ఎలా దరిచేర్చుకోవాలో సూచించాలని తన కన్సల్టెంట్ పీకేను కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభను మళ్లీ వెలుగులోకి తీసుకురావాలన్న కార్యాచరణ ప్రణాళికకు ఊపిరిపోశారు. అందులో భాగంగా రాష్ట్రంలో కోటిమంది లక్ష్యంగా వైఎస్ పాలనలో లబ్ధిపొందిన కుటుంబాలు, అభిమానులను గుర్తించే పనికి శ్రీకారం చుట్టనున్నారు. శిక్షణ పొందిన నాలుగున్నర లక్షల మంది ప్రతి ఇల్లూ తట్టి ఆ కుటుంబ సభ్యులను ‘వైఎస్ కుటుంబం’లో చేర్చుకోవాలని ప్రణాళిక రూపొందించారు. సభ్యత్వ నమోదులో ప్రతి ఇంటి నుంచి ఒకరిని సభ్యులుగా చేర్పించాలని యోచిస్తున్నారు. ఈవిధంగా ఇంటింటికీ వైఎస్‌ను మరోసారి గుర్తు చేయడంతోపాటు, చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు, జగన్ ఇచ్చిన నవరత్న హామీల కరపత్రాలను ఇంటింటికీ చేర్చడం ద్వారా జగన్‌ను ప్రజలకు చేరువ చేయాలన్నదే ఈ ప్రణాళిక లక్ష్యంగా కనిపిస్తోంది.