ఆంధ్రప్రదేశ్‌

న్యూయార్క్‌లో బౌద్ధ చారిత్రక విశేషాల ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 31: 2020లో న్యూయార్క్‌లో జరిగే అంతర్జాతీయ బౌద్ధ ప్రదర్శన కోసం ప్రపంచంలోని ప్రసిద్ధ మ్యూజియాల్లో ఉన్న అమరావతి, ఆంధ్రదేశపు బౌద్ధ విశేషాలను సేకరించే పని చురుగ్గా సాగుతోంది. ఒకనాడు బౌద్ధ మతాన్ని అక్కున జేర్చుకుని ఆదరించిన ఆంధ్రదేశపు చారిత్రక విశేషాలను ప్రపంచ వ్యాప్తంగా అన్ని మ్యూజియాల నుంచి సేకరిస్తున్నారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన విలువైన ఈ వస్తువులను అత్యంత భద్రంగా సేకరించి న్యూయార్క్ తరలిస్తున్నామని, ప్రదర్శనల అనంతరం అంతే సురక్షితంగా వాటిని వాటి స్థానాలకు తిరిగి పంపుతామని న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (మెట్) సౌత్, సౌత్‌ఈస్ట్ ఏషియన్ ఆర్ట్ క్యూరేటర్ జాన్‌గయ్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్‌కు గురువారం టెలిఫోన్ ద్వారా ఆయన ఈ వివరాలు అందించారు. అమరావతి, ఆంధ్రదేశపు బౌద్ధ విశేషాలను ఒక్క ఏపీ నుంచే కాకుండా లండన్, చెన్నయ్, కలకత్తా, ముంబయ్, న్యూఢిల్లీలోని ప్రసిద్ధ మ్యూజియాల నుంచి సేకరిస్తున్నామని చెప్పారు. ‘మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని మ్యూజియాల్లో ఉన్న అమరావతి, ఆంధ్రదేశానికి సంబంధించిన బౌద్ధ సంబంధిత విశేషాలు, కళాఖండాలు, చారిత్రక వస్తువులను సేకరించి ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో ఉంచుతారు. ఈ ప్రదర్శనలతో ఆంధ్రదేశానికి మరోమారు అంతర్జాతీయ ఖ్యాతి రానున్నదని భావిస్తున్నారు. 9 మాసాల పాటు జరగనున్న ఈ ప్రదర్శన మొదట న్యూయార్క్ నగరంలో జరగనున్నదని, ఐరోపాలో ఎక్కడ నిర్వహించేది త్వరలో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.