ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో డేటా సైన్సు వర్సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 31: రాష్ట్రంలో అనలిటిక్స్, డేటా సైన్సు వర్సిటీ ప్రారంభించేందుకు మ్యూ సిగ్మా సంస్థ ముందుకు వచ్చింది. 500 మంది డేటా సైంటిస్టులతో రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి కనబరించింది. మ్యూ సిగ్మా కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ వెలగపూడి సచివాలయంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్సు, సిఎం డ్యాష్ బోర్డు, డ్రోన్ ఇమేజ్ రికగ్నిషన్, తదితర అంశాలతో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అనంతరం జెరాక్స్ కంపెనీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆ కంపెనీ ముందుకు వచ్చింది. విశాఖలోని మిలీనియం టవర్స్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అంగీకరిస్తే, స్థలం కేటాయిస్తామని మంత్రి తెలిపారు. సమయం వృథా కాకుండా పనులు ప్రారంభించాలని, సెప్టెంబర్‌లోగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐటి అడ్వైజర్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖను మంత్రి అభినందించారు. మంత్రి లోకేష్‌ను బ్రిటీష్ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కూడా కలిశారు.