ఆంధ్రప్రదేశ్‌

రుణాలు మరింత సులువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 31: వాల్మీకి/బోయ ఫెడరేషన్ ద్వారా ఇకపై 5గురు సభ్యులతో కూడిన గ్రూపుతో పాటు వ్యక్తిగత రుణాలు కూడా మంజూరు చేయనున్నట్లు ఫెడరేషన్ చైర్మన్ బిటి నాయుడు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెం.18 జారీ చేసిందన్నారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకోడానికి ఈనెల 15 తేదీ వరకూ ప్రభుత్వం గడువు పొడిగించిందని వెల్లడించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో 15 మంది సభ్యులతో కూడిన గ్రూపునకు మాత్రమే రుణమిచ్చే అవకాశం ఉండేదన్నారు. రాయలసీమలోని వర్గపోరు కారణంగా వాల్మీకి/బోయ యువత గ్రూపు రుణం పొందే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇదే విషయం సిఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు ఫెడరేషన్ చైర్మన్ బిటి నాయుడు తెలిపారు. ఈ జీవో ప్రకారం 5గురితో కలిపి గ్రూపు ఏర్పడి రుణం పొందే అవకాశం కలిగిందన్నారు. 5గురు సభ్యులు కలిగిన గ్రూపునకు రూ.10 లక్షల వరకూ రుణమిస్తారన్నారు. ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇస్తుండగా, మరో రూ.5 లక్షలు కూడా పొందే అవకాశం కలిగిందన్నారు. రూ.2లక్షల వరకూ వ్యక్తిగత రుణాలిస్తారన్నారు. రూ.లక్ష వరకూ ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వగా మిగిలిన మొత్తం బ్యాంకులు రుణాలుగా ఇస్తాయన్నారు. 15 మంది సభ్యులతో గ్రూపులు ఏర్పాటు కాకపోవడంతో, రుణాల కోసం ఫెడరేషన్‌కు కేటాయించిన నిధులు వృథాగా పడి ఉన్నాయన్నారు. రుణాల కోసం రూ.50 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.