ఆంధ్రప్రదేశ్‌

మైనింగ్, విద్య, రహదారి భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 31: మైనింగ్, తిరుపతి-తిరుమల ఘాట్ రోడ్డులో భద్రత తదితర అంశాలపై వెస్టర్న్ అస్ట్రేలియా ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. విజయవాడ సిఎం క్యాంప్ కార్యాలయంలో విద్య, మైనింగ్, జియాలజీ, రహదారి భద్రత, డిజిటల్ హెల్త్ కేర్, తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వెస్టర్న్ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్ రోగర్ కుక్ చర్చించారు. డిసెంబర్ 2016లో వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన సిస్టర్ ఒప్పందానికి కొనసాగింపుగా తాజాగా వివిధ రంగాల్లో ఎంఓయులు కుదుర్చుకున్నారు. ఈ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాకు వివరించారు. మైనింగ్ తదితర రంగాల్లో దాదాపు 3000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు వెస్టర్న్ ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. ఇనుప ఖనిజం, కర్నూలులో బంగారం గనుల తవ్వకాలపై, ఒప్పందాలు చేసుకున్నారు. తిరుపతి-తిరుమలలో ఘాట్ రోడ్డులో ప్రమాదాలు నివారించేందుకు వీలుగా ప్రత్యేక రోలర్ సేఫ్టీ బ్యారియర్లను ఏర్పాటు చేస్తారు. ప్రమాదాలు తరచూ జరిగే బ్లాక్ స్పాట్స్‌లో ఈ బ్యారియర్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించే వీలు ఉంటుంది. దీని ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని తిరుమల ఘాట్ రోడ్డులో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని సిఎం తెలిపారు. ఇరు రాష్ట్రాలకు మేలు జరిగేలా వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు. అమరావతిలో పెట్టుబడులకు వెస్టర్న్ ఆస్ట్రేలియా కూడా భాగస్వామి కావాలన్నారు. త్వరలో ఆ దేశంలో పర్యటిస్తానన్నారు. నాగార్జున వర్సిటీ, కర్టిన్ వర్సిటీ మధ్య కూడా విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ స్టాండింగ్ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
నవ్యాంధ్ర అభివృద్ధికి సహకారం
గనులు, రవాణా, సాంకేతికత, వైద్య, విద్యా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్ రోజర్ కుక్ వెల్లడించారు. తమ దేశానికి చెందిన పారిశ్రామిక పెట్టుబడిదారులను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఇవాల్టి నుంచి పశ్చిమ ఆస్ట్రేలియా, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సిస్టర్ స్టేట్ సంబంధాలు మరింత దృఢం కానున్నాయని చెప్పారు. ‘డైనమిక్ నాయకుడు చంద్రబాబు సారధ్యం వహిస్తున్న నూతన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.