ఆంధ్రప్రదేశ్‌

పెద్దనోట్ల రద్దు వల్లే జిడిపి పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 1: దేశంలో పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా దేశీయ స్థూల ఉత్పత్తి (జీడిపి) పతనమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఏడాది వ్యవధిలో వృద్ధిరేటు 7.9 నుంచి 5.7 శాతానికి దిగజారిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఏకపక్ష నిర్ణయాలే అన్ని అనర్ధాలకు కారణమని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా కూడా మోదీ పశ్చాత్తాపం చెందకపోవడం దురదృష్టకరమన్నారు. దాసరి భవన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, పుట్టా హరినాథరెడ్డితో కలసి ఆయన మాట్లాడుతూ గత ఏడాది నవంబరులో పెద్దనోట్లు రద్దుచేసిన సమయంలో 50 రోజులు వేచి ఉంటే సత్ఫలితాలు వస్తాయని, లేకుంటే తనను ఉరితీయాలంటూ భావోద్వేగానికి గురైన మోదీ జిడిపి పతనంతో ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నోట్ల రద్దు వల్ల సామాన్యులు అనేక ఇక్కట్లకు గురయ్యారే కానీ డబ్బున్న మారాజుల్లో ఏ ఒక్కరు కూడా ఇబ్బందులకు లోను కాలేదన్నారు. ఎంత నల్లధనాన్ని వెలికి తీసిందో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.