ఆంధ్రప్రదేశ్‌

గోదావరిలో పెరిగిన ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 1: గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. పౌర్ణమికి ముందు సముద్రం పాటు ప్రభావంతోపాటు ఎగువన భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో దిగువనున్న ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం పెరిగింది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రానికి 27 అడుగులకు చేరుకున్న గోదావరి వరద అక్కడ నుంచి తగ్గుముఖం పట్టి, శుక్రవారం సాయంత్రానికి 24 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలానికి దిగువన మరో 24 గంటల వరకు ప్రవాహ ఉద్ధృతి పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజివద్ద శుక్రవారం సాయంత్రం 10.80 అడుగుల మట్టంలో ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజి దిగువన మరింత ఉద్ధృతంగా ప్రవహిస్తూ వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. దీంతో బ్యారేజి దిగువ ఏటిగట్ల పరీవాహ ప్రాంతంలో అప్రమత్తం చేశారు. మరో ఇరవై నాలుగు గంటల వరకు వరద ప్రవాహం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 10.80 అడుగుల నీటి మట్టంలో సముద్రంలోకి 3.60 లక్షల క్యూసెక్కుల వరద జలాలను విడిచి పెడుతున్నారు. బ్యారేజి వద్ద 5.30 లక్షల క్యూసెక్కుల వుంది. అఖండ గోదావరి ఎగువ ప్రాంతం కాళేశ్వరం వద్ద 6.36 మీటర్లు, దుమ్ముగూడెం వద్ద 8.10, పేరూరు వద్ద 7.48, కూనవరం వద్ద 7.87, కుంట వద్ద 8.94, కొయిదా వద్ద 5.87, పోలవరం వద్ద 8.40, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద ప్రవాహం కొనసాగుతోంది.